బెన్ స్టోక్స్ సూపర్ కెప్టెన్సీ... కివీస్ 132 పరుగులకే ఆల్ అవుట్ ?

VAMSI
ఐపీఎల్ లాంటి మెగా క్యాష్ లీగ్ పూర్తి అయిన తర్వాత అన్ని టీమ్ ల సభ్యులు తమ తామా నేషనల్ డ్యూటీస్ లో నిమగ్నం అయ్యారు. అందులో భాగంగా ఈ రోజు ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ లు మూడు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా ఈ రోజు లండన్ లోని లార్డ్స్ స్టేడియం లో మొదటి టెస్ట్ స్టార్ట్ అయింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఎంతో నమ్మకంగా మొదట బ్యాటింగ్ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇంగ్లాండ్ జట్టు ఈ టెస్ట్ నుండి కొత్త కోచ్ గా బ్రెండన్ మెక్ కలమ్ మరియు కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ లతో కొత్త ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఈ సిరీస్ ను గెలవడం ఇంగ్లాండ్ కు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా తో రూట్ కెప్టెన్సీలో ఎంత దారుణంగా పరాభవం ఎదుర్కొందో తెలిసిందే.

అయితే కొత్త కెప్టెన్ స్టోక్స్ ను తమ బౌలర్లు అగ్రస్థానంలో నిలబెట్టారు అని చెప్పాలి. ఎందుకంటే కివీస్ ను మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 132 పరుగులకే కుప్పకూల్చింది. ఇందులో మొదటి నుండి ఆండర్సన్ మరియు పాట్స్ లు చెలరేగి కివీస్ పతనాన్ని శాసించారు. చెరో 4 వికెట్లు తీసుకుని స్వల్ప స్కోర్ కు కివీస్ ను పరిమితం చేశారు. కివీస్ ఆటగాళ్లలో కేవలం గ్రాండ్ హోమ్ ఒక్కడే అత్యధికంగా 42 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ విలియమ్సన్ ఐపీఎల్ లో పోగొట్టుకున్న ఫామ్ ను అలాగే పేలవమైన ఆటతో కొనసాగిస్తున్నాడు.

ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి స్టడీ గానే ఉన్నట్లు కనిపించినా ఓపెనర్ క్రాలీ వికెట్ ను కోల్పోయింది. ఇతను పరుగులు చేసి జెమీ సన్ బౌలింగ్ లో బ్లాండెల్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఎక్కువ పరుగులు చేసి ఇన్నింగ్స్ విజయం కోసం చూడాలి. ఇక మొదటి టెస్ట్ లోనే తన కెప్టెన్సీ స్టామినాని నిరూపించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: