కాస్త కష్టమే.. కానీ గెలిచి తీరుతాం : బవుమా
అయితే ఇక ఈ టి 20 సిరీస్ లో ఇండియాలో సీనియర్లు గా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లు లేకపోవడం గమనార్హం. వీరు లేకుండానే అటు కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతోంది టీమిండియా. ఈ క్రమంలోనే కె.ఎల్.రాహుల్ కెప్టెన్సీ లో టీమిండియా ఎలా రాణించ బోతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలీ. ఈ క్రమంలోనే ఇక టీమిండియాతో ఆడబోయే టీ20 సిరీస్ గురించి స్పందించిన దక్షిణాఫ్రికా జట్టు ఓపెనర్ టెంప బావుమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చేంత లగ్జరీ మాకు లేదు. కానీ టీమిండియా అలా కాదు టీమిండియాకు చాలా మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. ప్రస్తుతం దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. ఇక వరల్డ్ కప్ కి సిద్ధమయ్యే క్రమంలో టీమ్ ఇండియా లాంటి జట్టుతో మ్యాచులు ఆడటం మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఆస్ట్రేలియాలో పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అందుకే టీమ్ ఇండియా లాంటి బలమైన జట్టుతో పోటీ వరల్డ్ కప్ కు ముందు మా జట్టుకు ఎంతైనా అవసరం. టీ20 సిరీస్ లో తప్పక గెలిచి తీరుతామూ అంటూ ధీమా వ్యక్తం చేశాడు టెంప బావుమా..