
ఐపీఎల్ నుంచి.. అజింక్య రహానే ఔట్?
అయితే ఈ ఏడాది కోల్కతా నైట్రైడర్స్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. వరుసగా పరాజయాలతో సతమతమౌతుంది. దీంతో కోల్కత నైట్రైడర్స్ జట్టు ప్లే అవకాశాలు రోజురోజుకీ సంక్లిష్టంగా మారిపోతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే కోల్కతా నైట్రైడర్స్ జట్టు కి మరో షాక్ తగిలింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అజింక్యా రహానే గాయపడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్లీ రహానే జట్టుకు అందుబాటులోకి వస్తాడా లేదా అని ఆందోళన చెందారు అభిమానులు.
ఈ క్రమం లోనే ప్రస్తుతం అజింక్యా రహానే గాయం తీవ్రత ఎక్కువ గానే ఉంది అనేది తెలుస్తుంది. దీంతో ఇక గాయం నుంచి కోలుకునేందుకు రహానే నాలుగు వారాల పాటు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఉండబోతున్నాడు అన్నది తెలుస్తుంది. కాగా ఇప్పటివరకు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఏడు మ్యాచ్ లూ ఆడిన అజింక్యా రహనే 133 పరుగులు చేశాడు. అయితే అజింక్య రహానే గాయం కారణం గా జట్టు కేవలం ఐపీఎల్ సీజన్ కి మాత్రమే కాదు ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా వెళ్లబోయే ఇంగ్లాండు టూర్ కి కూడా దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఈ విషయం తెలిసి అభిమానులు నిరాశ లో మునిగిపోయాడూ.