కోహ్లీ వికెట్ కోల్పోగానే.. ఆకాశం వైపు చూస్తూ ఏం చేసాడో చూడండి?

praveen
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ రికార్డుల  రారాజు విరాట్ కోహ్లీ ఈ ఏడాది మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఒక్క మ్యాచ్లో కూడా తన స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు విరాట్ కోహ్లీ.  భారీ అంచనాల మధ్య బ్యాటింగ్ కు రావడం చివరికి తక్కువ పరుగులకే వికెట్ చేర్చుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇటీవల కాలంలో అయితే గత రెండు మూడు రోజుల నుంచి వరుసగా గోల్డెన్ డక్ ఔట్ గా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుకున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో ఇక దారుణమైన ప్రదర్శన చేస్తున్న విరాట్ కోహ్లీ గురించి అందరూ చర్చించుకుంటున్నారు.

 ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పంజాబ్ కింగ్స్  మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరోసారి డక్ ఔట్ ఫీట్ సాధిస్తాడు ఏమో అని ఫ్యాన్స్ భయపడిపోయారు. కానీ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం 14 బంతుల్లో 2 ఫోర్లు ఒక సిక్సర్ తో 20 పరుగులు సాధించాడు. కానీ ఆ తరువాత అనవసరమైన షాట్ ఆడి వికెట్ చేజార్చుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మినహా మరో అర్థసెంచరీ సాధించి లేదు విరాట్ కోహ్లీ.

 అయితే విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయిన తర్వాత పైకి చూస్తూ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు గా ఏదో చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త వేగంగా మారిపోయింది. రబడా బౌలింగ్ లో రాహుల్ చహర్ కి సింపుల్ క్యాచ్ ఇచ్చిన విరాట్ కోహ్లీ వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే పెవిలియన్ బాట పట్టిన కోహ్లీ ఆకాశం వైపు చూస్తూ దేవుడా ఏంటిది అన్నట్లుగా ఏదో అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది కాస్త వైరల్ గా మారి పోవడంతో ఇది చూసిన అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీజన్ మొత్తం ఇలాగే ఆడితే టీమిండియాలో చోటు కోల్పోవడం పక్క.. ఇలా వికెట్ కోల్పోయినప్పుడు ఆకాశం వైపు చూడకుండా బ్యాటింగ్ మీద మరింత దృష్టి పెడితే బాగుంటుంది అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: