ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. వేయి మంది మహిళలను?
ప్రేమ పేరుతో వెంట పడటం ఇక అవసరాలు తీర్చుకోవడం చివరికి నడిరోడ్డు మీద యువతులను వదిలేయడం లాంటి ఘటనలు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయ్. ఇలా ఇటీవలి కాలంలో ప్రేమ అనేది ఒక కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చుకోవడానికి ప్రేమిస్తున్నారు తప్ప నిజమైన ప్రేమికులు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నారు అనే చెప్పాలి. ఇక్కడ ఓ యువకుడు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వెయ్యి మంది యువతులు మహిళలు మోసగించాడు. ఆరేళ్ల సమయంలో వెయ్యి మంది మహిళలను మోసగించిన కేటుగాడిని ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
అయితే ఏపీ తెలంగాణ లోని అమ్మాయిలే లక్ష్యం గా శ్వేతా మాధురి గాయత్రి తదితర పేర్లతో సోషల్ మీడియా లో అకౌంట్లు ఓపెన్ చేశాడు వంశీకృష్ణ అనే 31 ఏళ్ల వ్యక్తి. వాటి ద్వారా ఉన్నత చదువులు సంపన్న వర్గాలకు చెందిన యువతులను కనిపెట్టి స్నేహం చేస్తూ ఉండేవాడు. ఉద్యోగాలు సేవా కార్యక్రమాలు వంటివి ఆశ చూపించేవాడు. ఇలా మాయ మాటలతో నమ్మించి వెయ్యిమంది మోసం చేశాడు. ఇలా వివిధ మార్గాల్లో మోసాలకు పాల్పడి ఐదు కోట్ల వరకూ డబ్బులు గుంజాడు. కాగా సైబర్ క్రైమ్ పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు పట్టుకున్నారు.