వార్నర్ కి ప్రాక్టీస్ తక్కువ.. పార్టీలే ఎక్కువ : వీరేంద్ర సెహ్వాగ్
ఇకపోతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి ఒక విషయాన్ని చెప్పుకొచ్చాడు. 2009 ఐపీఎల్ సీజన్ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. 2009 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇక ఆ సమయంలో ఢిల్లీ జట్టులో కొనసాగిన డేవిడ్ వార్నర్ ను నియంత్రించడం ఎంతో కష్టం అయ్యింది అని చెప్పుకొచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్ లో కొన్ని సార్లు గొడవలు పడ్డాడు అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే కెప్టెన్ గా ఉన్న సమయంలో నేను కొంత మంది ఆటగాళ్ల పై అసహనం వ్యక్తం చేశాను. అందులో డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. జట్టులో చేరిన కొత్తలో అతడు ప్రాక్టీస్ మ్యాచ్ల కంటే పార్టీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడు. అంతేకాదు తరచూ కొందరు ఆటగాళ్లతో గొడవ పడుతూ ఉండేవాడు. దీంతో చివరి రెండు మ్యాచ్లలో అతని ఆడనివ్వకుండా ఇంటికి పంపించేసాము. పాఠం చెప్పాలంటే కొన్ని కొన్నిసార్లు కొంతమందిని పక్కన పెట్టక తప్పదు. అప్పుడు అతను జట్టుకి కొత్త.. నువ్వు ఒక్కడివే కాదు జట్టులో అందరూ ముఖ్యమని అతనికి చూపించడం ఎంతో ముఖ్యం. వార్నర్ ను దూరం పెట్టి మేము గెలిచాము కూడా అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు..