దంచికొట్టిన బట్లర్.. కానీ అంతలోనే?

praveen
2022 ఐపీఎల్ సీజన్ లో జోస్ బట్లర్ ఎంత ఫుల్ ఫాంలో కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ జట్టు సాధించిన విజయాలలో అటు జోస్ బట్లర్ కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి.  కాగా ఈ ఏడాది ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు బట్లర్. ఇప్పటివరకు మూడు సెంచరీలు 3 హాఫ్ సెంచరీలతో తిరుగులేని ప్రస్థానం కొనసాగిస్తూ ఉన్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఇక ఐపీఎల్ సీజన్ లో ఎక్కువ సెంచరీలు సాధించింది జోస్ బట్లర్ కావడం గమనార్హం.

 ఇలా అద్భుతమైన ప్రస్థానం కొనసాగిస్తున్న జోస్ బట్లర్  విరాట్ కోహ్లీ 4 సెంచరీల రికార్డును అధిగమించడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారూ. ఈ క్రమంలోనే జోస్ బట్లర్ బ్యాట్ నుంచి మరో సెంచరీ ఎప్పుడు వస్తుందా అని ప్రతి మ్యాచ్లో కూడా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో ఎప్పటిలాగానే ఓపెనర్గా బరిలోకి దిగాడు జోస్ బట్లర్.

 ఇక రావడం రావడమే తన హిట్టింగ్ మొదలుపెట్టిన బట్లర్ అదరగొట్టాడు అని చెప్పాలి. ముఖ్యంగా మేటి బౌలర్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న రబడా బౌలింగ్లో బట్లర్ చితక్కొట్టుడు కొట్టాడు అని చెప్పాలి. వరుసగా 4,4,2,4 పరుగులు సాధించాడు. ఓవర్ లో 5వ బంతికి రబడా వేసిన యార్కర్ ను సమర్థవంతంగా ఎదుర్కొని బౌండరీ తరలించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. అయితే 16 బంతుల్లో 5 ఫోర్లు ఓకే సిక్సర్ సహాయంతో 30 పరుగులు చేసిన బట్లర్.. ఇక ఈ సారి సెంచరీ చేయడం ఖాయం అనే విధంగానే జోరు మీద కనిపించాడు. కానీ ఆ తర్వాత రబడా బౌలింగ్లోనే ఆఖరి బంతిని గాలిలోకి లేపి చివరికి రాజపక్స కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు జోస్ బట్లర్. దీంతో అభిమానులు ఎంతగానో నిరాశ చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: