రోహిత్ సిక్స్ కొడితే.. డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసిన స్టార్ హీరో?
చివరి ఓవర్లలో 9 పరుగులు అవసరమైన సమయంలో ముంబై బౌలర్లు బాగా బౌలింగ్ చేసి 3 పరుగులు మాత్రమే ఇచ్చారు. దీంతో గుజరాత్ టైటాన్స్ కి ఓటమి తప్పలేదు. అయితే ఇక ఇలా ఎంతో ఉత్కంఠ భరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో బాలీవుడ్ హీరో రణబీర్ సింగ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిపోయాడు అనే చెప్పాలి. ఇక ముంబై ఇండియన్స్ అభిమాని అయిన రణవీర్ సింగ్ స్టేడియంలో తెగ సందడి చేశాడూ. ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఉండటం చూసి స్టేడియం లో డాన్సులు కూడా చేశారు.
దీంతో అక్కడ ఉన్న కెమెరాలు మొత్తం రణవీర్ సింగ్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్న తీరును క్యాప్చర్ చేస్తూ ఉన్నాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే మ్యాచ్ జరుగుతున్న సమయంలో రోహిత్ శర్మ ఒకసారి సిక్సర్ బాదడంతో స్టాండ్స్ లో ఉన్న రణవీర్ సింగ్ తెగ ఎంజాయ్ చేసాడు. ఏకంగా డాన్సులు చేశాడు. అంతేకాదు ఇక కొన్నిసార్లు ముంబై ఫీల్డర్లు అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో డిఆర్ఎస్ కు వెళ్లాలి అంటూ స్టాండ్స్ నుంచి సూచనలు ఇస్తూ ఉండడం కూడా నవ్వులు పూయించింది అని చెప్పాలి. కాగా రణవీర్ సింగ్ ఫోటోని ముంబై ఇండియన్స్ తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పిచ్ పై ఆర్ఎస్ స్స్టాండ్ లో ఆర్ఎస్ అంటూ ఒక కామెంట్ చేశారు.