గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. మరికొన్ని రోజుల్లో?
ఈ క్రమంలోనే అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో పాటు మహిళల కోసం ఐపీఎల్ తరహాలో నే ఒక టోర్ని నిర్వహిస్తుంది. ఉమెన్స్ టి20 ఛాలెంజ్ పేరుతో నిర్వహిస్తున్న లీగ్ క్రేజ్ కూడా అంతకంతకూ పెరిగి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ లీగ్లో భాగంగా 12 మంది విదేశీ క్రికెటర్లతో బరిలోకి దిగబోతోంది అన్న తెలిసిందే. కాగా ఈ టోర్నీ ఈనెల 23వ తేదీ నుంచి పూణే వేదికగా ప్రారంభం కాబోతుంది. ఇక ఈ టోర్నీలో భాగంగా మూడు జట్లు నాలుగు మ్యాచ్ లలో తలపడుతున్నాయి. అయితే కరోనా వైరస్ కారణంగా ఇక ఈ మహిళల టోర్నీకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఐపిఎల్ నిర్వహణ విషయంలోనే అష్టకష్టాలు పడిన బీసీసీఐ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మహిళల టోర్ని నిర్వహించడంపై అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో గతేడాది కరోనా వైరస్ కారణంగా ఇక టోర్ని నిర్వహించలేక పోయారు అని చెప్పాలి. కానీ ఇప్పుడు మాత్రం వైరస్ ప్రభావం తగ్గడంతో ఇక తగిన జాగ్రత్తలు పాటిస్తూనే ఈ టోర్నీని నిర్వహించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మహిళల టోర్నీని వీక్షించేందుకు అటు ప్రేక్షకులు కూడా సిద్ధమైపోతున్నారు అనే చెప్పాలి..