ఇద్దరికీ ఈ మ్యాచ్ చాలా కీలకం... ఫేవరెట్ ఎవరంటే?

VAMSI
ఈ రోజు ఢిల్లీ మరియు కోల్కతా జట్ల మధ్య ముంబై లోని వాంఖడే మైదానంలో జరగనుంది. ఈ సీజన్ లో రెండు జట్లు కూడా టైటిల్ సాధించే ఫేవరెట్ జట్లుగానే లీగ్ ను ప్రారంభించాయి. అయితే టోర్నీ సాగుతున్న కొద్దీ ఇరు జట్లు కూడా తమ పేలవమైన ఆటతీరుతో ప్రదర్శించి కీలకమైన సమయాల్లో తడబడి కొన్ని మ్యాచ్ లలో ఓటమిని చవి చూశాయి. ప్రస్తుతం రెండు జట్లు వరుసగా ఏడు మరియు ఎనిమిది స్థానాలలో కొనసాగుతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవడం చాలా కీలకం. ప్లే ఆప్స్ రేస్ లో ఉండాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిలో ఉన్నారు.

రెండు జట్లలోనూ కీ ప్లేయర్లు ఉన్నా ఎందుకో తడబడుతూ ఓటమిని అంగీకరిస్తున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ మొదట ఫీల్డింగ్ తీసుకుంది. అయితే ఢిల్లీకి ఛేజింగ్ లో అంత మంచి రికార్డు లేదని చెప్పాలి. గత మ్యాచ్ లోనూ రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం ఈ మ్యాచ్ లో ఫేవరెట్ మాత్రం ఢిల్లీ అని తెలుస్తోంది. అయితే కోల్కతా ను కూడా తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేదు. కానీ శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ గా అంతగా రాణించలేకపోవడం ఒక్కటే కేకేఆర్ ని నిరుత్సాహపరిచే విషయం.

అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఈ మ్యాచ్ లో గెలవాలంటే, కెప్టెన్ పంత్, మార్ష్ మరియు పావెల్ లు అంచనాలకు తగినట్లు రాణించాలి. వరుసగా అవకాశాలు అందుకుంటున్న పావెల్ ఈ మ్యాచ్ లో అయినా చెలరేగుతాడా అన్నది చూడాలి. ఈ పిచ్ పూర్తిగా బ్యాటింగ్ కు సహకరించినా ఛేజింగ్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పవచ్చు. మరి రెండింటిలో ఏ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగుపడుతుంది అన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: