థర్డ్ అంపైర్ జోక్యం చేసుకోవాలి.. ముంబై కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతుంది. పాత జట్లు విఫలమవుతూ ఉంటే కొత్త జట్లు రాణిస్తూ ఉన్నాయి. ఐపీఎల్ లో ఒక కొత్త గా ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్లు ప్రతిభ చాటుతున్నారు.  ఇదంతా ఎప్పుడూ జరిగేదే.. ఇదంతా పక్కన పెడితే ఈ సారి మాత్రం అంపైర్లు  ఇస్తున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.  ఏకంగా అంపైర్లు ఇచ్చే తప్పుడు నిర్ణయాల కారణంగా మ్యాచ్ స్వరూపం మారిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అంపైర్ల నిర్ణయాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఏకంగా నడుము పై భాగం కంటే బంతి వెళ్లినప్పటికీ అంపైర్లు కొన్ని మ్యాచులు నో బాల్ ఇవ్వకపోవడం  పెద్ద వివాదానికి దారితీస్తుంది అన్న విషయం తెలిసిందే.

 ఇటీవల ఇదే విషయంపై ముంబై ఇండియన్స్ కోచ్ మహెల జయవర్ధనే  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్స్మెన్ నడుము కంటే ఎక్కువ ఎత్తులో దూసుకు వచ్చే నో బాల్స్ విషయంలో థర్డ్ అంపైర్   జోక్యం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు జయవర్ధనే. ఢిల్లీ రాజస్థాన్ మ్యాచ్లో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయానికి కట్టుబడటంతో ఇక నోబాల్ అంశం వివాదాస్పదంగా మారిపోయింది. మ్యాచ్ దశను మార్చే కీలక సమయాల్లో అంపైర్లు ఇలాంటి నిర్ణయాలు పరిశీలించాలని థర్డ్ అంపైర్  ను కోరడం ఎంతో సరైనది అంటూ జయవర్ధనే సూచించాడు. కాగా  జయవర్దనే ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడు అన్న విషయం తెలిసిందే.

 ఇటీవలే రాజస్థాన్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో నోబాల్ వివాదం రాజుకుంది. ఏకంగా అంపైర్ నో బాల్ ఇవ్వకపోవడంతో రచ్చరచ్చ జరిగింది.  ఏకంగా మైదానం లో ఉన్న తమ బ్యాట్స్మెన్లను వెనక్కి రావాలి అంటూ కెప్టెన్ రిషబ్ పంత్ పిలవడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను మ్యాచ్ ఫీజులో 100% జరిమానా అసిస్టెంట్  కోచ్ ప్రవీణ్ ఆమ్రే కు వందశాతం ఫీజు జరిమానా విధించింది. అంతేకాకుండా శార్దూల్  ఠాగూర్ కి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: