RCB పని అయిపోయిందా.. సేమ్ సీన్ రిపీట్?

praveen
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ప్రస్తుతం ఐపీఎల్లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టుగా కొనసాగుతోంది. అయితే ఐపీఎల్ మొదలయిన నాటి నుంచి ప్రతి సీజన్లో కూడా బెంగళూరు జట్టు ఆడుతూ ఉంది.  కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ జట్టు కప్పు గెలవకపోవడం గమనార్హం. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఫైనల్కు చేరింది కూడా కేవలం మూడు సార్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక ప్రతి సారి ఈసారి కప్పు మాదే అనే స్లోగన్ తో బరిలోకి దిగే బెంగళూరు జట్టు ప్రతిసారి ప్రేక్షకులను నిరాశ పరుస్తూనే ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే మెగా వేలం కారణంగా ఈ సారి జట్టులో ఎన్నో మార్పులు జరిగాయి. ముఖ్యంగా కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు. డూ ప్లేసెస్ కొత్త కెప్టెన్ గా వచ్చాడు. దీంతో ఇక ఆ జట్టు అదృష్టం మారిపోతుందని కప్ గెలవడం ఖాయం అని అందరూ భావించారు. ఇక అందరూ అనుకున్నట్లుగానే అటు బెంగళూరు జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్రత్యర్థులను చిత్తు చేసింది. విరాట్ కోహ్లీ పెద్దగా రాణించలేక పోయినా జట్టులో ఉన్న మిగతా ఆటగాళ్లు మాత్రం మంచి పామ్ కనపరిచారు. దీంతో ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు తిరుగులేదు అని అనుకుంటున్న సమయంలో మళ్లీ బెంగళూరు పేలవ ప్రదర్శన మొదలైంది.


 ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విజయఢంకా మోగిస్తోంది అనుకుంటే కేవలం 68 పరుగులు మాత్రమే చేసి కుప్పకూలిపోయింది బెంగళూరు జట్టు. ఆ తర్వాత ఎంతో అలవోకగా సన్రైజర్స్ ఘన విజయం సాధించి మెరుగైన రన్రేట్ తో రెండో స్థానంలోకి దూసుకెళ్లింది. ఇక ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ జరిగింది. ఇప్పటికే ఒకసారి రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది బెంగళూరు జట్టు. ఈసారి కూడా ఆర్సిబిదే విషయం అనుకున్నారు. కానీ 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు చిన్న లక్ష్యాన్ని కూడా చేధించలేక పోయింది. అందరూ బ్యాట్స్మెన్లు చేతులెత్తేయడంతో 115 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో బెంగళూరు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. గతంలో కూడా మొదట్లో వరుస విజయాలు సాధించి తర్వాత చతికిలబడిన బెంగళూరు జట్టు ఈసారి కూడా అదే విధంగా చేస్తూ ఉండడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb

సంబంధిత వార్తలు: