డుప్లెసిస్.. నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా?

praveen
సాధారణంగా ఐపీఎల్ లో బాగా ఫ్యాన్ బేస్ కలిగిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అయితే ప్రతి ఏడాది మొదట్లో మంచి ప్రదర్శన చేయడం ఇక ప్లే ఆఫ్ సమయానికి వరుస ఓటములతో సతమతం అవ్వటం బెంగుళూరు  జట్టు చేస్తూ ఉంటుంది. అయితే ఒకప్పుడు కేవలం కోహ్లీ ప్రదర్శన మీద మాత్రమే బెంగళూరు జట్టు ఆధారపడి ఉండేది. కానీ ఈ ఏడాది మాత్రం జట్టులోకి డు ప్లేస్సిస్ సహా దినేష్ కార్తీక్ లాంటి మంచి ఆటగాళ్లు ఉండడంతో కోహ్లీ పెద్దగా రాణించలేక పోయినా జట్టు మాత్రం వరుస విజయాలు సాధిస్తోంది అని చెప్పాలి.

 దీంతో ఈసారి ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న బెంగళూరు జట్టు కెప్టెన్ డుప్లేసెస్ సారథ్యంలో  కప్పు కొట్టడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ ప్రతి సీజన్ లాగే మొదట్లో మెరుపులు మెరిపించి ఆ తర్వాత ఉసూరుమనిపించే లాగే కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి. మొన్నటి వరకు వరుస విజయాలు సాధించిన బెంగళూరు జట్టు ఇటీవల సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఎక్కడ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం 68 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు.

 అయితే మొన్నటికి మొన్న సెంచరీ మిస్ చేసుకున్న బెంగళూరు కెప్టెన్ డూప్లెసిస్ సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం  సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ తీవ్రంగా నిరాశ పరిచాడు. కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి చివరికి క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో అందరూ షాక్ లో మునిగిపోయారు. సరే డు ప్లేసెస్ వికెట్ కోల్పోయిన కోహ్లీ ఉన్నాడులే అని షాక్ నుంచి తేరుకుంటున్న  సమయంలో ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ మొదటి బంతికే డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో బెంగళూరు జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది అని చెప్పాలి. ఇది చూసిన తర్వాత కోహ్లీ నే  అనుకుంటే ఇక ఇప్పుడు నువ్వు కూడానా అంటూ డుప్లెసిస్ వికెట్ కోల్పోవడం  పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: