అంపైర్ పై పంత్ సెటైర్.. ఏమన్నాడో తెలుసా?

praveen
రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నరాలు తెగేఉత్కంఠ మధ్య సాగింది. ఇక ప్రేక్షకులందరినీ కన్నార్పకుండా మార్చ్ వీక్షించేలా  చేసింది. మరీ ముఖ్యంగా చివరి ఓవర్లో నోబల్ వివాదం చోటు చేసుకోవడం ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఆగ్రహంతో చిర్రుబుర్రులాడుతూ కనిపించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇలా ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ ముందు నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించ లేకపోయింది ఢిల్లీ క్యాపిటల్స్.

 దీంతో 15 పరుగుల తేడాతో రిషబ్ పంత్ సేన ఓటమి చవిచూసింది. ఈ క్రమంలోనే తమ ఓటమిపై కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ మొత్తం రాజస్థాన్ బౌలర్లు బాగా రాణించారు. కానీ చివర్లో పావెల్ మాకు విజయంపై ఆశలు కల్పించాడు.  నిజానికి చివరి ఓవర్లో ఆ నోబాల్ అనేది మాకు అత్యంత విలువైనది. కానీ నా చేతిలో ఏమీ లేదు కదా.. నో బాల్ విషయంలో అంపైర్ల  నిర్ణయంతో మేము నిజంగానే నిరాశకు లోనయ్యాము అంటూ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. డగౌట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ బంతి విషయంలో అసంతృప్తితోనే ఉన్నారు. నిజానికి థర్డ్ అంపైర్  ఈ విషయంలో జోక్యం చేసుకొని నో బాల్ గా ప్రకటించి ఉంటే బాగుండేది. ఇక ఈ సీజన్లో అంపైరింగ్ ఎంత బాగుందో చూస్తూనే ఉన్నాను కదా అంటూ సెటైర్ వేసాడు పంత్.

 ప్రత్యర్థి 200కు పైగా స్కోర్ చేసినప్పుడు దాన్ని ఛేదించే క్రమంలో టార్గెట్ చేరుకుంటామనే సమయంలో ఇలా జరగితే ఎవరైనా అసహనానికి గురి చేస్తూ ఉంటుంది. ఇది ఇరువైపులా తప్పు ఉంది అంటూ తన తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేశాడు రిషబ్ పంత్.  ఇక చివరికి అద్భుతమైన పోరాట ప్రతిభ కనబరిచిన తమ జట్టు సభ్యులు అందరిని కూడా అభినందించాడు. తలెత్తుకుని ఉండాలని తదుపరి మ్యాచ్కు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: