వారెవ్వా.. ఏం యార్కర్ వేసావ్ గురూ.. బొక్క బోర్లా పడ్డ బ్యాట్స్మెన్?

praveen
ఇటీవల కాలంలో ఐపీఎల్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అన్న విషయం తెలిసిందే. సాధారణంగా బ్యాట్స్మెన్  మాత్రమే టి 20 ఫార్మాట్లలో ఆధిపత్యాన్ని చెలాయిస్తారు అని చెబుతూ ఉంటారు. కానీ ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ లో మాత్రం  ఎంతో మంది బౌలర్లు తమ అద్భుతమైన బౌలింగ్తో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. బ్యాట్స్మెన్లను తక్కువ పరుగులకు కట్టడి చేయడమే కాదు కీలక సమయంలో వికెట్లు పడగొడుతున్నారు. అద్భుతమైన బంతులను సంధిస్తూ బ్యాట్స్మెన్లను  సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నారు.


 ముఖ్యంగా ఇటీవలి కాలంలో ప్రీమియర్ లీగ్లో భాగంగా ఎంతో మంది ఆటగాళ్లు అద్భుతంగా యార్కర్లు సంధిస్తూ ఇక వికెట్లు పడగొట్టిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఐపీఎల్ 2022 లో భాగంగా  నిన్న ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటిదే జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ సంధించిన యార్కర్కు ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ వద్ద అసలు సమాధానమే లేకుండాపోయింది. యార్కర్ ఎదుర్కొనేందుకు ప్రయత్నించి చివరికి బొక్క బోర్లా పడిపోయాడు బ్యాట్స్మెన్.


 ముంబై ఇన్నింగ్స్ తొలి ఓవర్లో భాగంగా ముఖేష్ చౌదరి వేసిన ఐదో బంతిని డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు ముంబై బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్. అయితే బంతి మిస్ అయి చివరికి వికెట్లను తాకేసింది. 139 కిలోమీటర్ల స్పీడ్ వచ్చిన బంతిని ఆపలేక ఉషాన్ కిషన్ బొక్క బోర్లా పడిపోయాడు. దీంతో ఒక్క పరుగు కూడా చేయకుండానే ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్  గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. అయితే మరో వైపు తొలి ఓవర్లో రెండో బంతికే రోహిత్ శర్మను కూడా ముఖేష్ చౌదరి పెవిలియన్ కు పంపించడం గమనార్హం. దీంతో అతని బౌలింగ్ ప్రతిభపై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: