ఐపీఎల్ : మరో బిగ్ మ్యాచ్.. కుల్దీప్ vs చాహల్?

praveen
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో వరుసగా ట్విస్టులు ఉన్నట్లుగానే ప్రస్తుతం ఐపీఎల్ లో జరుగుతున్న మ్యాచులో కూడా ప్రతి మ్యాచ్ అంతకుమించి అనే రేంజ్ లోనే ఉత్కంఠభరితంగా మారిపోతుంది. ఒక మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఇంతకంటే ఉత్కంఠభరితమైన మ్యాచ్ ఈ ఐపీఎల్లో చూడలేమేమో అని అనుకుంటున్నారు ప్రేక్షకులు. కానీ ఆ తర్వాత మ్యాచ్లోనే అంతకుమించిన ఉత్కంఠ ప్రేక్షకుల్ని టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంది. అందుకే ప్రేక్షకులు ప్రతి మ్యాచ్ కన్నార్పకుండా వీక్షిస్తున్నారు అనే చెప్పాలి.


 కాగా నేడు ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా 34వ మ్యాచ్ జరగబోతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగబోతున్న ఈ మ్యాచ్ ఎప్పటిలాగానే సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రారంభం కాబోతుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య గణాంకాలు చూసుకుంటే ఈ రెండు జట్లు 24 సార్లు తలపడ్డాయి. అయితే ఏ జట్టు కూడా మరో జట్టు పై చేయి సాధించలేదు. ఎందుకంటే ఈ రెండు జట్లు కూడా చెరో 12 మ్యాచ్లలో విజయం సాధించాయి. దీంతో నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంది.


 అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అధిపత్యం కొనసాగించాలంటే వార్నర్ చెలరేగి ఆడటంతో పాటు కుల్దీప్ యాదవ్ మరోసారి తన స్పిన్ బౌలింగ్ మాయాజాలం చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు సూపర్ ఫామ్ లో కొనసాగుతున్న జోస్ బట్లర్.. ఇక ఇటీవల హ్యాట్రిక్ వికెట్ల తో సత్తాచాటిన యుజ్వేంద్ర చాహల్ రాజస్థాన్ విజయంలో కీలకపాత్ర వహించబోతున్నారు అన్నది తెలుస్తుంది. కాగా పాయింట్ల పట్టిక లో రాజస్థాన్ రాయల్స్ మూడవ స్థానంలో కొనసాగుతుండగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆరవ స్థానంలో ఉంది. దీంతో నేడు జరగబోయే బిగ్ ఫైట్ లో ఎవరిది విజయం అన్నదానిపై ప్రస్తుతం ప్రేక్షకులలో ఊహాగానాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: