ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్లు ఆ ముగ్గురే : ఉమ్రాన్ మాలిక్

praveen
ఇటీవలి కాలంలో ఐపీఎల్ కారణంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇలా కొంత మంది ఆటగాళ్లు బ్యాటింగ్ లో మరికొంత మంది ఆటగాళ్లు బౌలింగ్లో అదరగొడుతు క్రికెట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరచడమే కాదు మాజీ ఆటగాళ్ల ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. ఒకప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు లోకి ఎంట్రీ ఇచ్చిన ఫాస్ట్ బౌలర్ నటరాజన్ ఒక్కసారిగా ఎంత హైలెట్గా మారిపోయాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 అద్భుతమైన యార్కర్లు సంధిస్తూ యార్కర్ కింగ్ గా మారిపోయాడు. ఇక ఇప్పుడు అదే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి మరో బౌలర్ సంచలనం సృష్టిస్తున్నాడు. మెరుపువేగంతో బంతులను విసురుతో బ్యాట్స్మెన్లను తెగ భయపెడుతూ ఉన్నాడు. ఏకంగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ కీలక సమయంలో వికెట్లు పడగొట్టి ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఆ బౌలర్ ఎవరో కాదు ఉమ్రాన్ మాలిక్. జమ్మూకాశ్మీర్కు చెందిన ఈ యువ ఆటగాడు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాడు. అతనిలో మంచి ప్రతిభ ఉంది. వెంటనే  భారత జట్టులోకి తీసుకోండి అని మాజీ ఆటగాళ్లు రికమండ్ చేసేంతలా అతను బౌలింగ్తో అదరగొడుతున్నాడు..



 ఇకపోతే ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఉమ్రాన్ మాలిక్. తనకు తానే ఆదర్శం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియాకు ఆడాలన్న తన కల నెరవేరే రోజు తొందరగా రావాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. సహజంగా నేను బంతిని బాగా విసురుతాను.. ఇర్ఫాన్ పఠాన్ మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను అంటూ ఉమ్రాన్ మాలిక్  చెప్పుకొచ్చాడు. ఇక ప్రపంచంలోనే జస్ప్రిత్ బూమ్రా,  మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ లు ముగ్గురే అత్యుత్తమ బౌలర్లు అంటూ చెప్పుకొచ్చాడు ఉమ్రాన్ మాలిక్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: