బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఈ టిప్స్ ట్రై చేయండి?

praveen
ఉరుకుల పరుగుల జీవితం.. నేటి రోజుల్లో ఎవరికి ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయమే లేకుండా పోయింది.. మరీ ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకపోతే ఇక వ్యాయామం చేయడానికి సమయం ఎలా ఉంటుంది చెప్పండి. చివరికి ఇలా ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేయడం వ్యాయామానికి దూరంగా ఉండటం వెరసి ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు నేటి రోజుల్లో జనాలు. అంతేకాదండోయ్ నేటి రోజుల్లో మారిపోయిన ఆహారపు అలవాట్లు కూడా అనర్ధాలకు దారి తీస్తున్నాయి. ఒకప్పటిలా గుమగుమలాడే వంటింటి ఆహారం తినడం కంటే ఇక నేటి రోజుల్లో హోటల్ లో దొరికే పిజ్జా బర్గర్లు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు.

 మసాలా ఫుడ్డు లేకుండా ఒక్క ముద్ద కూడా దిగడం లేదు అని చెప్పాలి నేటి రోజుల్లో. ఇక ఇదంతా పక్కన పెడితే నేటి రోజుల్లో ఏ ఉద్యోగం చేసినా ఒకేచోట గంటల తరబడి కూర్చుని  చేసేదే. కనీసం పక్కకు లేచి కాసేపు నడవడానికి కూడా సమయం లేని పరిస్థితి. ఇక అలాంటి ఉద్యోగంలో  కొనసాగుతూనే కొత్త ఆహారపు అలవాట్లు చేసుకుని ఇక వ్యాయామానికి దూరంగా ఉంటే జరిగేది ఏంటి స్థూలకాయం. ఒక్కసారిగా బరువు పెరిగి పోయి ఇటీవల కాలంలో ఎంతోమంది ఇబ్బందిపడుతున్నారు. ఇక బరువు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.

 అయితే ప్రతిరోజూ వ్యాయామం చేయడం కాకుండా ఇక వ్యాయామంతో పాటు కొన్ని టిప్స్ పాటిస్తే ఇక బరువు తొందరగా తగ్గేందుకు అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బరువు తగ్గాలనుకునేవారు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇక పరగడుపున పది నుంచి పన్నెండు కరివేపాకు ఆకులను తినాలి.  అంతేకాదండోయ్ ఇక భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో 10 గ్రాములు తేనెతో వేడినీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. పండ్లు కూరగాయలు పుష్కలంగా తినండి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం బెటర్. ఇలా చేయడం వల్ల బరువు తొందరగా తగ్గే అవకాశం ఉందట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: