కరోనా ఎఫెక్ట్.. బీసీసీఐ షాకింగ్ నిర్ణయం?
ఈ క్రమంలోనే క్రికెట్ జట్టులో ఉన్న సిబ్బందితోపాటు ఆటగాళ్లు అందరికి కూడా ఇటీవలే ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు నిర్వహించారు. ఇక మిగతా ఆటగాళ్లకు కూడా ఒక వేళ పాజిటివ్ వస్తే ఇక మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు కూడా తెర మీదికి వచ్చాయి. కాగా ఢిల్లీ జట్టు ఆ తర్వాత పంజాబ్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 20వ తేదీన జరగాల్సి ఉంది. అయితే ఇక ఈ మ్యాచ్ విషయంలో ఇటీవల బిసిసిఐ సంచలన నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం పూణేలో రేపు జరగాల్సిన మ్యాచ్ ను ముంబైలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఢిల్లీ జట్టులో 5 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో ఇలా వేదికను మార్చుతూ నిర్ణయం తీసుకున్నాము అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. సుదూర బస్సు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫిజియోథెరపిస్ట్ ప్యాట్రిక్ ఈనెల 15వ తేదీన కరోనా వైరస్ బారిన పడ్డారు ఇక ఏప్రిల్ 16న మిచెల్ మార్ష్, డాక్టర్ అభిజిత్ ఆకాష్ మానే కూడా వైరస్ బారిన పడ్డారు అన్న విషయం తెలిసిందే. ఇక వీరందరూ కూడా ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు..