లక్నో vs బెంగళూరు.. నేడు మరో ఉత్కంఠభరితమైన పోరు?

praveen
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రతి ప్రేక్షకుడిని  కన్ఫ్యూజన్లో పడేస్తుంది. ఎందుకంటే గత సీజన్ వరకు ఏ జట్టు బాగా ప్రదర్శన చేస్తోంది ఏ జట్టు వరుస విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది అన్న విషయం ప్రేక్షకులకు ఒక అంచనా ఉండేది. కానీ ఈ సారి మాత్రం అంచనాలు తారుమారు అవుతాయి. గత ఏడాది వరకూ పేలవమైన ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొన్న జట్లు ఇక ఈ ఏడాది మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాయ్. అంతేకాదు ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో,గుజరాత్ జట్లు తిరుగులేని విధంగా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయ్.


 ఇక అన్ని జట్లు కూడా అద్భుతంగా రాణిస్తూ  ఇక పటిష్టంగా కనిపిస్తూ ఉండటంతో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా జరుగుతుంది. ఇక హోరాహోరీగా పోటీపడుతున్న జట్లు వరుస విజయాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి అన్నది తెలుస్తుంది. కాగా నేడు మరో ఉత్కంఠభరితమైన పోరు జరగబోతుంది. ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో.. ఐపీఎల్ లో సీనియర్ జట్టుగా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. కాగా ఈ రెండు జట్లు కూడా ప్రస్తుతం ఐపీఎల్లో హోరాహోరీగా పోటీపడుతున్నాయి అని చెప్పాలి.


 ఇప్పటివరకు ఐపీఎల్ లో భాగంగా 6 మ్యాచులు ఆడిన ఈ రెండు జట్లు నాలుగు మ్యాచ్ లలో గెలిచి ఇక ఎనిమిది పాయింట్లతో మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. దీంతో ఇక నేడు జరగబోయే మ్యాచ్ లో ఎవరిది పై చేయి కాబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారబోతుంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో సాయంత్రం  ఏడున్నర గంటలకు ఇక ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. లక్నో జట్టుపై సాధించాలంటే బెంగళూరు జట్లులో హర్షల్ పటేల్ రాణించడం ఎంతో కీలకం. బెంగుళూరు జట్టుపై ఆధిపత్యాన్ని కొనసాగించాలని అంటే అటు కె.ఎల్.రాహుల్ బ్యాటింగ్  ఎంతో కీలకం ఇక బెంగళూరు జట్టు పై అటు కేఎల్ రాహుల్ కి మంచి మెరుగైన సగటు కూడా ఉండటం గమనార్హం. దీంతో నేడు జరగబోయే మ్యాచ్ పై మరింత ఆసక్తి పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: