నోటికి టేప్ వేసి.. చేతులు కట్టి వదిలేశారు : చాహల్

praveen
మొన్నటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కీలక స్పిన్నర్ గా కొనసాగిన యుజ్వేంద్ర చాహల్ ఇక ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వెళ్ళిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల యుజ్వేంద్ర చాహల్ తన కెరియర్ లో జరిగిన ఒక చేదు అనుభవం గురించి బయట పెట్టడం సంచలనంగా మారిపోయింది. తాగిన మత్తులో ఒక క్రికెటర్ తనను 15 వ అంతస్తు నుంచి వేలాడదీశాడు అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు యుజ్వేంద్ర చాహల్. ఈ విషయం కాస్త సంచలనంగా మారిపోయింది. ఇక ఈ విషయం అంత చిన్నది కాదని దీనిపై వెంటనే విచారణ జరపాలి అంటూ మాజీ క్రికెటర్లు బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇదిలా ఉంటే.. గతంలో యుజ్వేంద్ర చాహల్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం మళ్లీ తెర మీదికి వస్తున్నాయి. 2011 ఐపీఎల్ సీజన్ సమయంలో తాను ముంబై జట్టుకు ఆడుతున్న రోజుల్లో అప్పుడు తన సహచరుడు గా ఉన్న జేమ్స్ ఫ్రాంక్లిన్, ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ తను కట్టేసారు అంటూ చెప్పుకొచ్చాడు చాహల్. నా నోటికి టేపు అతికించి గదిలో వదిలేసి రాత్రంతా తనును అలాగే మరిచిపోయారని తెలిపాడు. 2011లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్షిప్ గెలిచిన సమయంలో ఇక జట్టు సభ్యులందరూ చెన్నైలో ఉన్నారు. ఆ సమయంలో సైమండ్స్ చాలా ఫ్రూట్ జ్యూస్ తాగాడు.


 తర్వాత అతను ఏమనుకున్నాడో నాకు అర్థం కాలేదు. ఫ్రాంక్లిన్, సైమండ్స్  కలిసి నా చేతులు కాళ్ళు కట్టేశారు ఇక నోటికి టేప్ కూడా వేశారు. ఇక నువ్వే ఈ కట్లు విప్పు కోవాలి అంటూ గదిలో వేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పార్టీలో పడిపోయి నన్ను పూర్తిగా మర్చిపోయారు.. తర్వాత రోజు ఉదయం గది శుభ్రం చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి నన్ను చూసి షాక్ అయ్యాడు. ఆ తర్వాత మరికొంతమందిని పిలిచి ఇక కట్లు విప్పాడు అంటూ గతంలో చెప్పాడు. ఇక ఈ విషయం కూడా ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. అయితే ఈ విషయం తెరమీదికి రాగా ప్రస్తుతం డర్హం కౌంటీ ప్రధాన కోచ్ గా కొనసాగుతున్న ఫ్రాంక్లిన్ తో ప్రైవేట్ గా మాట్లాడటం అంటూ ఆ జట్టు యాజమాన్యం తెలపడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: