అతన్ని క్రికెట్ నుండి బ్యాన్ చేయాల్సిందే : రవిశాస్త్రి

praveen
ప్రస్తుతం టీమిండియా లో స్టార్ స్పిన్నర్ గా కొనసాగుతున్నాడు యుజువేంద్ర చాహల్.. తన స్పిన్ బౌలింగ్ లో ఎప్పుడు మాయ చేస్తూ ఉంటాడు. కీలక సమయంలో బౌలింగ్ చేస్తూ కీలకమైన వికెట్లను పడగొడుతూ ఒక జట్టు విజయంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాడు. ఇకపోతే మొన్నటి వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో కొనసాగిన యుజ్వేంద్ర చాహల్ ఇక ఇటీవల జరిగిన కారణంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు లోకి వెళ్ళిపోయాడు అన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ జట్టులో కూడా బాగా రాణిస్తున్నాడు.

 ఇకపోతే ఇటీవల సోషల్ మీడియా వేదికగా చాహల్  చెప్పిన ఒక విషయం సంచలనంగా మారిపోయింది. ఏకంగా 2013 సీజన్ సమయంలో మ్యాచ్ గెలిచినా  ఆనందంలో అందరూ ముందు పార్టీ చేసుకుంటున్న సమయంలో ఒక క్రికెటర్ తనను దగ్గరికి పిలిచి 15 అంతస్తు నుంచి వేలాడదీశాడు. కొంచెంగా పట్టు తప్పిన కూడా నా ప్రాణాలు కోల్పోయే వాడిని..  ఎంతగానో భయం వేసింది అంటూ చాహల్ ఇప్పుడు వరకు ఎవరికీ తెలియని నిజాలు బయటపెట్టాడు. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే అలా పదిహేనవ అంతస్తు నుంచి అతని వేలాడదీసిన క్రికెటర్ ఎవరు అనే విషయాన్ని మాత్రం చాహల్ బయట పెట్టలేదు.

 ఇటీవలే ఇదే విషయంపై మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యుజవేంద్ర చాహల్ ను 15 అంతస్తు నుంచి వేలాడదీసిన  ఘటన ఇప్పుడు జరిగితే అలా చేసిన ఆటగాడు ఎవరైనా సరే క్రికెట్ నుంచి లైఫ్ టైం నిషేధం విధించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొంత మంది మాజీ క్రికెటర్లు కూడా ఈ విషయంపై స్పందిస్తూ చాహల్ కు జరిగిన ఘటనపై వెంటనే బీసీసీఐ విచారణకు ఆదేశించాలంటూ కోరుతూ ఉన్నారు అనే విషయం తెలిసిందే. ఇలా ఇటీవల చాహల్ బయటపెట్టిన నిజం కాస్త అంతకంతకూ వివాదంగా మారిపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: