అతని పక్కన పెట్టేయండి : ఆకాష్ చొప్రా

praveen
ప్రస్తుత సమయంలో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్లో అదరగొడుతున్నారు. ఎలాంటి అనుభవం లేక పోయినప్పటికీ ఒత్తిడికి లోనుకాకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుంటున్నారు. భారత జట్టులో చోటు సంపాదించుకోవడమే లక్ష్యంగా ప్రతి మ్యాచ్లో రాణిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం అంతకుముందు ఐపీఎల్ సీజన్లలో అనుభవం ఉన్నప్పటికీ కూడా ఎందుకో తమ ప్రతిభ చాట లేకపోతున్నారు. ప్రతి మ్యాచ్లో కూడా పేలవ ప్రదర్శన చేస్తూ జట్టుకు భారంగా నే మారిపోతున్నారు అని చెప్పాలి.


 ఇక అలాంటి ఒక బ్యాట్స్మెన్ అటు ఢిల్లీ కాపిటల్ జట్టులో కూడా ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ కాపిటల్ జట్టు పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అయితే ఢిల్లీ కాపిటల్స్ ఆడిన మ్యాచ్ లలో మన్దీప్ సింగ్ రెండు మ్యాచ్ లలో కూడా దారుణంగా విఫలం కావడం గమనార్హం. ఈ క్రమంలోనే మణిదీప్ సింగ్ పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడూ. ఆశించిన స్థాయిలో మన్దీప్ సింగ్ రాణించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. జట్టులో ప్రదీప్ సింగ్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఆటతీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది  అంటూ చెప్పుకొచ్చాడు.


 తన ఐపీఎల్ కెరియర్ లో 107 మ్యాచ్లు ఆడిన మన్దీప్ సింగ్  1692 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సీజన్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి జట్టుకు భారంగా మారిపోతున్నాడు. కాగా గతంలో పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు మణిదీప్ సింగ్. ఈ క్రమంలోనే అతని పేలవ ఫామ్ కారణంగా ఐపీఎల్ లో ఎన్నో జట్లు మారుతూ వస్తున్నాడు. ఢిల్లీ కాపిటల్స్ అతని పక్కన పెడితే బాగుంటుందని అటు ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు అని చెప్పాలి. కాగా ఇటీవలే లక్నోతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి చవిచూసింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: