ఆకాశ్ చోప్రాకి కౌంటర్ ఇచ్చిన చాహల్.. ఏమన్నాడంటే?

praveen
సాధారణంగా సిని సెలబ్రెటీలతో పోల్చి చూస్తే అటు క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీలు పోస్టులు పెడితే కేవలం ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వారు మాత్రమే చూస్తూ ఉంటారు. అదే క్రికెటర్లకు సంబంధించిన అంశం ఏదైనా సోషల్ మీడియా లోకి వస్తే అది ప్రపంచ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అందుకే క్రికెటర్లు పెట్టిన ప్రతి పోస్ట్ కూడా క్షణాల వ్యవధిలో వైరల్ గా మారిపోవడం చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు మాజీ క్రికెటర్ గా ఉండి కామెంటేటర్ గా కొనసాగుతున్నారు తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడం చేస్తూ ఉంటారు.



 ఇలా కొన్ని కొన్ని సార్లు మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయి అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక మరికొన్ని సార్లు ఇలా సోషల్ మీడియాలో క్రికెటర్ల మధ్య జరిగే సంభాషణలు కూడా ప్రతి ఒక్కరిని నవ్వు తెప్పిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక భారత క్రికెట్లో మాజీ ఆటగాడిగా ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్ గా కొనసాగుతున్నాడు ఆకాష్ చొప్రా. క్రికెటర్ గా బాగా గుర్తింపు సంపాదించుకో లేకపోయినా కామెంటేటర్ గా మాత్రం మంచి పాపులారిటీ పొందాడు. ఇక ఎప్పుడూ భారత క్రికెట్ గురించి ఏదో ఒక పోస్టు పెడితూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాడు.


 ఈ క్రమంలోనే ఇటీవలే ఐపీఎల్ గురించి ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఎంతోమంది ప్లేయర్లు సిక్సర్లతో రెచ్చిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి బౌలర్లకు పై భారీ సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. ఇక ఇదే విషయంపై స్పందించిన ఆకాశ్ చోప్రా ఎవరైనా ఆటగాడు 100 మీటర్లకు పైగా సిక్సర్ కొడితే ఇక ఆ సిక్సర్ కి  ఆరు పరుగులు కాదు 8 పరుగులు ఇవ్వాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇదే విషయంపై స్పందించిన ఇండియా స్టార్ స్పిన్నర్  చాహల్ ఒకవేళ బ్యాట్స్మెన్ 3  బంతులను డాట్స్ చేసాడు అంటే చాలు ఒక వికెట్ ఇవ్వాలి అంటూ ఫన్నీగా కౌంటర్ ఇచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: