రిషబ్ పంత్ కు గుడ్ న్యూస్.. ఇక ఐపీఎల్ లో తిరుగుండదు?
కాగా ఐపీఎల్ చరిత్రలోనే ఛాంపియన్ జట్టుగా కొనసాగుతోన్న ముంబై ఇండియన్స్ పై అద్భుతమైన విజయాన్ని సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు. అయితే ఇలా విజయానందంలో ఉన్న రిషబ్ పంత్ సేనకు అంతలోనే ఊహించని షాక్ తగిలింది. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న మిచెల్ మార్చ్ గాయం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసింది. అయితే పాకిస్థాన్ పర్యటన ముగియగానే అతను ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో చేరాల్సి ఉంది. కానీ అతను గాయం బారిన పడడంతో ఐపీఎల్కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది.
ఇలాంటి సమయంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఒక గుడ్ న్యూస్ అందింది అనేది తెలుస్తుంది. ఇటీవలే గాయం కారణంగా పాకిస్థాన్తో జరగబోయే సిరీస్కు దూరమైన ఆసీస్ ఆటగాడు మిచెల్ మార్స్ అటు ఐపీఎల్కు మాత్రం అందుబాటులో ఉండబోతున్నాడు అనేది తెలుస్తుంది. గాయం తీవ్రత పెద్దగా లేదని కేవలం రెండు వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచించారట. దీంతో అటు పాకిస్తాన్తో సిరీస్కు దూరమైనప్పటికీ ఇక నేరుగా ఐపీఎల్ ఆడేందుకు భారత రాబోతున్నాడు మిచెల్ మార్చ్ ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో చేరాక 1,2 మ్యాచ్లకు దూరమైనప్పటికీ ఆ తర్వాత సీజన్ అంత అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక మిచెల్ మార్ష్ రాకతో ఢిల్లీ జట్టు మరింత పటిష్టంగా మారే అవకాశం ఉంది..