ఐపీఎల్ 15: శ్రేయస్ అయ్యర్... కోల్ "కథ" మారుస్తాడా?

VAMSI
ఐపీఎల్ లో ఇప్పటి వరకు జరిగిన 14 సీజన్ లలో కేకేఆర్ జట్టు రెండు సార్లు టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ఈ రెండు టైటిల్ లు కూడా గౌతమ్ గంభీర్ కెప్టెన్సీ లో 2012 మరియు 2014 సీజన్ లో వచ్చినవే కావడం విశేషం. అయితే ఆ తర్వాత టీమ్ నుండి గౌతమ్ గంభీర్ ఫామ్ కోల్పోవడం, కెప్టెన్ నుండి తొలగించడం జరిగిపోయింది. ఆ వెంటనే గౌతమ్ గంభీర్ ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. ఇతని తర్వాత దినేష్ కార్తీక్ కెప్టెన్ గా వచ్చినా జట్టు రాతను మార్చలేకపోయాడు. గత సీజన్ లో మోర్గాన్ తన వంతు ప్రయత్నం చేసినా జట్టును ఫైనల్ కు చేర్చాడు. కానీ ఫైనల్ లైన్ ను దాటలేకపోయారు.

అప్పటి నుండి గత 8 సంవత్సరాలుగా మరో టైటిల్ ను అందుకోవడానికి విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటి నుండి ఎందరో ప్లేయర్స్ వచ్చారు, అయినా టైటిల్ ను అందుకోలేకపోయింది. అయితే ఈ రోజు నుండి స్టార్ట్ కానున్న ఐపీఎల్ 15 సీజన్ లో శ్రేయస్ అయ్యర్ ను తమ కొత్త కెప్టెన్ గా నియమించుకుంది. ఈ సీజన్ అయినా బాగా ఆడి టైటిల్ ను గెలవాలని ఉత్సాహంతో ఉన్నారు. మరి కీలక మ్యాచ్ లలో చేతులు ఎత్తేసే అలవాటున్న కేకేఆర్ కథను కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మారుస్తాడా? అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో కేకేఆర్ తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం చాలా అవసరం. రెండు జట్లకు కొత్త కెప్టెన్ లు కావడంతో సీనియర్లతో నిండి ఉన్న జట్లను నడిపించడం సవాలుతో కూడుకున్న పని. మరి ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు మొదటి మ్యాచ్ లో తమ కెప్టెన్సీ తో ఆకట్టుకుంటారా అన్నది తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: