ఐపీఎల్ సీజన్ 15: చెన్నై జట్టులో "ఆ నలుగురు" చెలరేగితే ?

VAMSI
ఈ రోజు ఇండియా లో క్యాష్ రిచ్ క్రికెట్ లీగ్ గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన 15 ప్రారంభం కానుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 14 సీజన్ లు ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. అయితే 14 సీజన్ లుగా ఈ లీగ్ లో కేవలం 8 జట్లు మాత్రమే టైటిల్ కోసం పోరాడాయి. కానీ ఇప్పుడు మొత్తం 10 జట్లు సీజన్ 15 టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు సీజన్ ఓపెనర్ లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు సంచలనాలకు మారు పేరైన కోల్కతా నైట్ రైడర్స్ మధ్యన జరగనుంది. ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ముంబై లోని వాంఖేడ్ వేదికగా జరుగుతుంది.
ఐపీఎల్ లో జరుగుతున్న మొదటి మ్యాచ్ కావడం వలన ఇరు జట్ల ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఐపీఎల్ నుండి రవీంద్ర జడేజా మొదటిసారి కెప్టెన్ గా చేయనుండడం విశేషం. రెండు రోజుల క్రితం ఇంతకు ముందు కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని తప్పుకోవడంతో టీం యాజమాన్యం ఆల్ రౌండర్ జడేజాను తమ సారధిగా నియమించింది. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై గెలిచి రవీంద్ర జడేజాకు కెప్టెన్ గా మొదటి విజయాన్ని అందిస్తుందా లేదా అన్నది చూడాలి.
అయితే చెన్నై జట్టులో ఈ నలుగురు ఆటగాళ్లు కనుక రాణిస్తే గెలుపు దక్కడం సులభమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. వారిలో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా మరియు బ్రేవో. ఎప్పటిలాగే గైక్వాడ్ ఓపెనర్ గా రాణిస్తే చెంనికి శుభారంభం దక్కినట్లే. మరియు ఎప్పటిలాగే రవీంద్ర జడేజా మరియు బ్రేవో లు అల్ రౌండ్ ప్రదర్శన చేస్తే కోల్కతా పై గెలుపు అంతకష్టం ఏమీ కాదు. మరి ఏమి జరగనుందో చూడాలి. ఇక్కడ మొదట టూ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: