ఫినిషింగ్ లోనే కాదు.. షాకులు ఇవ్వడంలోనూ ధోనీ తర్వాతే ఎవరైనా?

praveen
ఇప్పుడు భారత క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోని తీసుకున్న నిర్ణయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు అని అభిమానులు కాస్త సంతోషంగానే ఉన్నారు. ఇక ధోనీ కెప్టెన్సీనీ కనీసం ఐపీఎల్లో ఆయన చూడగలుగుతున్నాం అని అనుకున్నారు. కానీ ఇటీవలే ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా తప్పుకున్నాడని కెప్టెన్సీ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగిస్తున్నట్లు ప్రకటిస్తూ అందరికీ షాకిచ్చాడు.


 అయితే ఇక ధోని గురించి చర్చ జరుగుతోంది. ఇప్పుడు ధోని కేవలం ఫినిషింగ్ లోనే కాదు షాక్ ఇవ్వడంలో కూడా ముందుంటాడు అని అనుకుంటున్నారు అభిమానులు. ఇక కాస్త ధోని కెరియర్ లో కి వెళ్లి ఎన్నో విషయాలను నెమరు వేసుకుంటున్నారు. 2007, 2011 వన్డే ప్రపంచకప్ లలో గెలిపించాడు 2004 నుంచి 2009 మధ్య జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సమయంలో జట్టులో ఎన్నో సంక్షోభాలు సమస్యాత్మక పరిస్థితులు వచ్చినా.. అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచాడు ధోని. భారత్ క్రికెట్లోనే కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సైతం మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా పేరు సంపాదించుకున్నాడు.


 ఇక మొదటి నుంచి చెన్నై జట్టు ధోనీ సారథ్యంలోని ఐపీఎల్లో బరిలోకి దిగింది. ఇక 2008లో ప్రారంభమైన తొలి సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్  రన్నరప్ గా నిలిచింది. 2010, 11, 18, 21 సీజన్లలో విజేతగా నిలిచింది. 2020 లో మాత్రమే చెన్నై ఎప్పుడూ లేనంతగా అత్యంత దారుణం ప్రదర్శన చేసింది. ధోని ఇప్పుడే కాదు ఇప్పటికే ఎన్నోసార్లు అభిమానులకు షాక్ ఇచ్చాడు. 90 టెస్టులు ఆడిన క్రికెటర్ 100టెస్ట్ ల మైలురాయిని అందుకోవాలని అనుకుంటాడు. కానీ ధోని అలా కాదు 90 టెస్ట్ ల రోజుల అనంతరం 2014లో రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఎంపికకు దూరంగా ఉన్నా ధోని.. 2020 ఆగస్టు 15వ తేదీన రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో చెన్నై కెప్టెన్ సి కి గుడ్ బై చెప్పేసాడు. దీంతో ధోనీ ఫినిషింగ్ లోనే కాదు షాక్ లు ఇవ్వడంలోను ముందుంటాడు అని అభిమానులు అనుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: