అప్పుడు సెహ్వాగ్.. ఇప్పుడు మయాంక్.. సేమ్ టు సేమ్?

praveen
ఇటీవలి కాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు భారత జట్టులో చోటు దక్కించుకుని.. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు. టీమిండియాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాని కొంత మంది ఆటగాళ్లు మాత్రం నిర్లక్ష్య మైన ఆటతీరుతో అందరిని నిరాశపరుస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు అనే చెప్పాలి.. గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయిన యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ ఇక ఇప్పుడు ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.


 ఇటీవలే బెంగుళూరు వేదికగా శ్రీలంకతో రెండో టెస్టు మ్యాచ్ ను ప్రారంభించింది టీమిండియా. ఈ క్రమంలోనే తొలుత బ్యాటింగ్కు దిగింది టీమిండియా. అయితే గత మ్యాచ్లో లాగానే ఈసారి కూడా భారత్ అద్భుతంగా రాణిస్తుంది అని అనుకున్నప్పటికీ అనూహ్యంగా తొలి వికెట్ను కోల్పోయింది టీమిండియా. అవసరం లేని పరుగుకు ప్రయత్నించి మయాంక్ అగర్వాల్ రనౌట్ అయ్యాడు. వికెట్స్ సమర్పించుకున్నాడు. అయితే మయాంక్ అగర్వాల్ అవుట్ అయిన బంతి రిప్లై లో చెక్ చేయగా నోబాల్ కావడం గమనార్హం. దీంతో ఇది తెలిసిన తర్వాత మయాంక్ అగర్వాల్ ను దురదృష్టం వెంటాడింది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.


 భారత్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ లో విశ్వ ఫెర్నాండో బౌలింగ్లో మూడో బంతికి మయాంక్ అగర్వాల్ ఫ్రంట్ ప్యాడ్ కు తగిలింది. దీంతో శ్రీలంక ఫీల్డర్లు ఎల్బీడబ్ల్యు  గా అప్పీల్ చేశారు. అయితే అటు అంపైర్ మాత్రం అప్పీల్ ను తిరస్కరించాడు.  అయినప్పటికీ తొందరపడిన మయాంక్ అగర్వాల్ ఏకంగా పరుగు కోసం ప్రయత్నించాడు. ఇక నాన్ స్ట్రైక్ లో ఉన్న రోహిత్ శర్మ నో అని చెప్పినప్పటికీ మయాంక్ అగర్వాల్ మాత్రం వినిపించుకోలేదు. చివరికి రనౌట్ రూపంలో వికెట్ కోల్పోయాడు మయాంక్ అగర్వాల్. అయితే ఆ తర్వాత రిప్లైలో ఆ బంతి నోబాల్ కావడం గమనార్హం. అయితే నోబాల్ సమయంలో రనౌట్ కి వికెట్ ఇస్తారు. ఇక అచ్చంగా ఇలాగే 2012లో భారత్ తొలి వికెట్ను రనౌట్ రూపంలో కోల్పోయింది.  వీరేంద్ర సెహ్వాగ్ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: