వరల్డ్ కప్: అదరగొట్టిన ఇండియా... విండీస్ ముందు భారీ లక్ష్యం !

VAMSI
మహిళల వరల్డ్ 2022 లో ఇప్పటి వరకు మ్యాచ్ లలో అత్యధిక స్కోర్ చేసింది టీం ఇండియా. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న మహిళల టీమ్ కీలక సమయంలో చెలరేగి తమ సత్తా ఏమిటో నిరూపించారు. ఈ రోజు హామిల్టన్ వేదికగా జరిగిన 10 వ మ్యాచ్ లో ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ లు తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన మిథాలీ బ్యాటింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపింది. నిజంగా చెప్పాలంటే మిథాలీ ఈ సిరీస్ లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఇదే అని చెప్పాలి. అసలే రెండు వరుస విజయాలతో జోరు మీదున్న విండీస్ ను అడ్డుకోవాలంటే స్వేచ్ఛగా ఏ ఒత్తిడి లేకుండా ఆడాలి. దీనికోసం ముందుగా బ్యాటింగ్ చేస్తేనే మంచి ప్రదర్శన ఇవ్వగలరు.
క్రికెట్ విశ్లేషకులు ఇచ్చిన సలహాను కూడా పాటించని టీంఇండియా యాజమాన్యం ఈ మ్యాచ్ కు కూడా షెఫాలీ వర్మను పక్కన పెట్టేసింది. కానీ ఇండియా ఇన్నింగ్స్ ను వేగంగానే ఆరంభించినా యస్తిక రూపంలో 49 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. ఇక వెంటనే మరో రెండు వికెట్లు కోల్పోవడంతో మళ్ళీ ఇండియా 200 అయినా చేస్తుందా అని అందరూ అనుకున్నారు. కానీ వాటన్నింటికీ అడ్డుకట్ట వేస్తూ ఓపెనర్ స్మృతి మందాన మరియు హర్మన్ ప్రీత్ కౌర్ లు వెస్ట్ ఇండీస్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొని ఇండియాకు భారీ స్కోర్ ను అందించారు. స్మ్రితి మందన్న 119 బంతుల్లో 13 ఫోర్లు మరియు రెండు సిక్సర్ లతో 123 పరుగులు చేసి అవుట్ అయింది. హర్మన్ ప్రీత్ 107 బంతుల్లో 10  ఫోర్లు రెండు సిక్సర్ ల సాయంతో 109 పరుగులు చేసి అవుట్ అయింది.
వీరిద్దరూ కలిసి 4 వ వికెట్ కు 184 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి రికార్డు సాధించారు. వరల్డ్ కప్ లలో భారత్ ఆ వికెట్ పై ఇదే అత్యధిక భాగస్వామ్యం. అలా నిర్ణీత ఓవర్ లలో ఇండియా 8 వికెట్ల నష్టానికి 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో గెలవాలంటే విండీస్ 318 పరుగులు చేయాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: