షాకింగ్ : టీమిండియా స్టార్ ప్లేయర్ తలకు గాయం?

praveen
మరికొన్ని రోజుల్లో మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ మహిళల వన్డే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా ప్రస్తుతం అద్భుతమైన వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది భారత మహిళల జట్టు. ఇక భారత జట్టుకు ఒక ప్రపంచ కప్ అందించి ఇక రిటైర్మెంట్ ప్రకటించాలని ప్రస్తుతం మహిళా దిగ్గజ క్రికెటర్ వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ నిర్ణయించుకుంది. జట్టును  ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాలని ఫిక్సయిపోయింది. కాగా ప్రస్తుతం మహిళల వన్డే ప్రపంచ కప్కు సంబంధించి వార్మప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక ఈ వార్మప్ మ్యాచ్లో సందర్భంగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం టీమిండియా జట్టులో స్టార్ బ్యాటర్ గా కొనసాగుతున్న స్మృతి మందన తలకు బలమైన గాయం అయ్యింది. ఇటీవలే వార్మప్ మ్యాచ్లో భాగంగా సౌతాఫ్రికా మహిళల జట్టు తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది.. సౌత్ ఆఫ్రికా బౌలర్  విసిరిన బౌన్సర్ వేగంగా వచ్చి స్మృతి మందాన హెల్మెట్ కు బలంగా తాకింది. దీంతో కాసేపటి వరకు నొప్పితో ఎంతో బాధపడింది టీమిండియా బ్యాటర్ మందనా.ఇక ఆ తర్వాత నొప్పితో చివరికి రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్కు చేరింది.

 ఇక ఆ తర్వాత స్మ్రితి మందాన  ఫీల్డింగ్ చేయడానికి కూడా రాకపోవడంతో అభిమానులందరిలో కూడా ఆందోళన మొదలైంది.  స్మృతి మందాన తలకు పెద్ద గాయం అయ్యిందేమో అని ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు అభిమానులు. అయితే ప్రపంచ కప్ లాంటి కీలక టోర్నీ ముందు స్మృతి మందాన లాంటి స్టార్ ప్లేయర్ జట్టుకు దూరమైతే విజయావకాశాలను ఎంతగానో దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే మందాన తగిలిన గాయం పెద్దది కాదని.. కంకషన్ ఏమీ జరగలేదు అంటూ బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా మార్చి 4వ తేదీ నుంచి మహిళల వన్డే ప్రపంచ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: