బీసీసీఐ నిర్ణయం.. కోహ్లీ ఫాన్స్ కు మండిపోతుంది?
దీంతో కెప్టెన్ గా కాకుండా ఒక సాదా సీదా ఆటగాడిగా ఇప్పుడు శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో తన 100వ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు విరాట్ కోహ్లీ. ఇక దీని కోసం అభిమానులు అందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తో అటు అభిమానులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు టెస్టుల సిరీస్ శ్రీలంకతో జరిగబోతుంది. మార్చి 4 నుంచి ఇక మొహాలీ స్టేడియం వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగబోతోంది. ఇదే కోహ్లీ కెరీర్లో వందో టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం.. అయితే ఇక స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కెరీర్లో ఒక మైలురాయి లాంటి మ్యాచ్ లో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అనుమతించడం లేదు అంటూ నిర్ణయం తీసుకోవడం మాత్రం ప్రస్తుతం షాకింగ్ గా మారిపోయింది.
కోహ్లీ విషయంలో కక్షపూరితంగా బీసీసీఐ వ్యవహరించిందని అందుకే ఇలా ప్రేక్షకులను అనుమతించకుండా నిర్ణయం తీసుకుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. దీనిపై పంజాబ్ క్రికెట్ సంఘం మాత్రం మరోలా స్పందించింది. కరోనా కేసులు వస్తుండడంతో బిసిసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అందుకే ప్రేక్షకులు లేకుండానే భారత్ శ్రీలంక మధ్య మొదటి టెస్టు మ్యాచ్ జరిపేందుకు నిర్ణయించింది. మొహాలీ స్టేడియం లో అంతర్జాతీయ మ్యాచ్లు జరిగి దాదాపు మూడేళ్లు అవుతుందని అందుకే ఎలాంటి అడ్డంకులు లేకుండా బిసిసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ చెప్పుకొచ్చింది పంజాబ్ క్రికెట్ సంఘం.