చిన్ని ప్రాణం కాపాడిన సచిన్ టెండూల్కర్.. అభిమానులు ఫిదా?
ఎక్కడైనా సోషల్ మీడియాలో సచిన్ టెండూల్కర్ ఫోటో కనిపించింది అంటే చాలు ఇండియన్ క్రికెట్ లో అతను ఆడిన ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ అభిమానుల ఆలోచనల్లో మెదులుతూ ఉంటాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా వేదికగా అభిమానులందరికీ ఎంతో దగ్గరగానే ఉంటున్నారు సచిన్ టెండూల్కర్. ఎప్పుడు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను తన సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు.
అంతేకాదు ఎన్నో ఆసక్తికర వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియా లో సచిన్ టెండూల్కర్ పోస్ట్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల సచిన్ పోస్టు చేసిన ఒక వీడియో కాస్త అభిమానుల మనసు దోచేస్తోంది. ఇక సచిన్ చేసిన పనికి ప్రస్తుతం ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే ఒక సీగల్ పక్షి గాయపడగా.. ఇక ఇది కాస్త బీచ్ లో పడి ఎగరడానికి ఎంతో ఇబ్బందులు పడుతుంది. ఈ విషయాన్ని గమనించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ దానిని చేరదీశాడు. ఇక దానికి నీరు తగ్గించే ప్రయత్నం కూడా చేశాడు. అంతే కాకుండా ఏదో ఒక ఆహారం పెట్టి అది కోలుకునేలా చేశాడు. ఇక పక్షులకి మనం అందించే కాస్త ప్రేమ ఆప్యాయత ఈ ప్రపంచాన్ని మరింత అందమైన ప్రదేశంగా మార్చుతుంది అంటూ ఒక క్యాప్షన్ జత చేస్తూ ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు మనసు చేస్తుంది.