భారత్- వెస్టిండీస్ టీ20 సిరీస్.. ఎప్పుడు ఎక్కడ జరుగుతుందంటే?

praveen
ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టుతో వరుసగా వన్డే టి20 సిరీస్ ఆడుతుంది భారత జట్టు. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సొంతగడ్డపై అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది అని చెప్పాలి. ఇటీవల వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడిన టీమిండియా ఇక ఈ సిరీస్లో వరుసగా మూడు మ్యాచులో కూడా విజయం సాధించి వెస్టిండీస్ జట్టును వైట్వాష్ చేసేసింది. ప్రత్యర్థి వెస్టిండీస్కు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం వెస్టిండీస్ టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది టీమిండియా.


 ఇక 3 టి20ల సిరీస్ లో అటు వన్డే సిరీస్ సీన్ రిపీట్ చేసి క్లీన్స్వీప్ చేయాలని కంకణం కట్టుకుంది టీమిండియా. ఈ క్రమంలోనే అద్భుతమైన వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతోంది. టి20 సిరీస్ లోని మ్యాచ్ లు అన్నీ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోతున్నాయి. ఇప్పటికే కోల్కతా చేరుకున్న భారత్ వెస్టిండీస్ జట్లు ప్రాక్టీస్ సెషన్లో మునిగి తేలుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య సిరీస్లో మొదటి మ్యాచ్ కి ప్రేక్షకుల ఎంట్రీ పై నిషేధం విధించారు. ఈ క్రమంలోనే ఇక ప్రేక్షకులు ఈ మ్యాచ్ ను టీవీలో వీక్షించేందుకు అవకాశం ఉంది. ఫిబ్రవరి 16న రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.



 ఇక ఈ మ్యాచ్ డిస్నీ  హాట్ స్టార్ యాప్ లో చూసేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ హిందీ ఇంగ్లీష్ తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కాబోతోంది. కాగా మొదటి మ్యాచ్లో క్లీన్స్వీప్ కి గురైన వెస్టిండీస్ జట్టు కనీసం టి20 సిరీస్ లో అయినా సరే విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని ఆశ పడుతుంది. కానీ అటు రోహిత్ శర్మ మాత్రం టీ20 సిరీస్ లో కూడా విజయం సాధించి తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్నాడు. దీంతో ఇక ఈ టీ20 సిరీస్ ఎంతో హోరాహోరీగా ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: