వైరల్ : బంగారం లాంటి అవకాశం.. మిస్ చేశాడు?
ఇక క్రీడాస్ఫూర్తికి మారుపేరైన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇటీవలే నేపాల్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐలాండ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నేపాల్ బౌలర్ కమల్ సింగ్ బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ఇక 19 ఓవర్లలో రెండవ బంతిని మార్క్ అడైర్ మిడ్ వికెట్ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి సరిగ్గా కుదరలేదు. దీంతో బంతి గాల్లోకి ఎగిరి అక్కడే దగ్గర్లో పడిపోయింది. ఇక ఆ లోపు సింగిల్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు బ్యాట్స్మెన్లు. అయితే ఇలా బంతి కోసం బౌలర్ పరిగెడుతున్న సమయం లో బ్యాట్స్మెన్ కు తాకడం తో అతను అక్కడే కింద పడిపోయాడు.
ఆ తర్వాత బంతిని అందుకున్న కమల్ కీపర్ ఆసిఫ్ షేక్ కి త్రో చేసాడు. ఈ క్రమం లోనే అవుట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆసిఫ్ బెయిల్ ను కింద పడేయకుండా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. ఇంతలో బ్యాట్స్మెన్ క్రీజ్లోకి సురక్షితంగా వచ్చేశాడు.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోతూ ఉండడంతో వికెట్ కీపర్ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.