టీమ్ ఇండియాకి ఎప్పుడు అతనే నాయకుడు : ఇర్ఫాన్ పఠాన్

praveen
మొన్నటి వరకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో ఎవరు ఊహకందని విధంగా మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. మొదట టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. ఇక ఆ తర్వాత అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది దీంతో అసలు విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్ గా అయినా కొనసాగుతాడా లేదా అని ఎంతోమంది అభిమానులు ప్రేక్షకులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. చివరికి అభిమానుల అనుమానం నిజమైంది.


 దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ కెప్టెన్సీ లో ఎంతో నవ్వుతు కనిపించిన విరాట్ కోహ్లీ సిరీస్ ఓటమి తర్వాత మాత్రమే టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ ప్రకటించిన షాకిచ్చాడు. అయితే కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ వదులుకొని రోజులు గడుస్తున్నా  ఇప్పటికి దీనికి సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉంది. ఎంతోమంది కోహ్లీ కెప్టెన్సీ గొప్పతనం గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినప్పటికీ  అతను జట్టులో ఉన్నన్ని రోజులు అతడే నాయకుడు అంటూ చెప్పుకొచ్చాడు.


 కెప్టెన్గా కోహ్లీ భారత జట్టులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంలో కీలక పాత్ర వహించాడు అంటూ ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. ఎన్నో ఏళ్ల పాటు జట్టును సరైన మార్గంలో నడిపించి ఆటగాళ్ల ఫిట్నెస్ను మరో స్థాయికి తీసుకెళ్లడంలో కూడా కీలక పాత్ర వహించాడు . ఒక్కో కెప్టెన్ కి ఒక్కొక్క ప్రత్యేకత  ఉంటుందని కోహ్లీ మైదానంలో ఎనర్జిటిక్ గా కనిపిస్తే.. రోహిత్ ఎంతో ప్రశాంతంగా ఉంటాడు అని... తన అనుభవాలతో జట్టును నడిపించడంలో సహకారం అందిస్తాడని చెప్పుకొచ్చాడు. కాగా మరికొన్ని రోజుల్లో వెస్టిండీస్తో వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది.  మొదటిసారి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఒక సాదాసీదా ఆటగాడిగా ఆడబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: