కోహ్లిని ఊరిస్తున్న రికార్డ్.. 6 పరుగులు చేస్తే చాలు?

praveen
అతను ఒక రికార్డుల రారాజు.. ఇప్పటి వరకు ఎంతోమంది దిగ్గజ క్రికెటర్ లు సాధించిన రికార్డులని తక్కువ సమయంలోనే బద్దలుకొట్టి తన పేరును లిఖించుకున్నాడు.. అతని ఆట తీరు చూసిన తర్వాత అతన్ని పరుగుల యంత్రం అని కూడా పిలవడం మొదలుపెట్టారు అభిమానులు. ఎందుకంటే ఆ రేంజ్ లో పరుగులు చేస్తూ బ్యాటింగ్తో విజృంభిస్తూ ఉంటాడు ఆ ఆటగాడు. ఇక మొన్నటివరకు కెప్టెన్ గా ఉన్నాడు.  ఇక ఇప్పుడు మాత్రం బ్యాటింగ్ పై దృష్టి పెట్టేందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇంతలా చెబుతున్నానంటే ఆ ఆటగాడు ఎవరో మీకు అర్ధమయ్యే ఉంటుంది.. అతను ఎవరో కాదు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.

 విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులను సృష్టించాడు. ఇక భారత క్రికెట్లో అయితే విరాట్ సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే విరాట్ కోహ్లీ క్రీజు లో ఉన్నాడు అంటే చాలు అతనికి బౌలింగ్ చేయడానికి బౌలర్ల వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎక్కువ పరుగులు ఇచ్చి చెత్త రికార్డులు ఖాతాల్లో చేర్చుకోవాల్సి వస్తుందో అని.. అందుకే భయపడుతూనే బౌలింగ్ చేసే బౌలర్లు ఒక్కసారైనా కోహ్లీ వికెట్ తీయాలి అనే కసితో ఉంటారు. ఇక భారత క్రికెటర్ అయినప్పటికీ విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా ఊహించని రేంజ్ లో క్రేజ్ వుంది అని చెప్పాలి.

 అయితే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన విరాట్ కోహ్లీ ముందు మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. వెస్టిండీస్ తో జరగబోయే సిరీస్ లో మరో ఆరు పరుగులు చేస్తే చాలు సొంత గడ్డపై వన్డేల్లో ఐదు వేల పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించబోతున్నాడు. ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్ మినహా ఏ భారత ఆటగాడు కూడా ఈ రికార్డు సాధించలేదు అనే చెప్పాలి. ఈ రికార్డు సాధించేందుకు సచిన్ 121 ఆడటం గమనార్హం. ఇక విండీస్తో జరగబోయే తొలి వన్డే మ్యాచ్ లో ఆరు పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ మాత్రం 96 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డు సాధించిన ఆటగాడిగా నిలుస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: