తగ్గేదేలా.. సిరీస్ ఓటమి.. హెడ్ కోచ్ పై వేటు?

praveen
ప్రపంచ క్రికెట్లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతుంది ఇంగ్లాండ్. ఇప్పటికే అంతర్జాతీయ టోర్నీలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఉంది అంటే చాలు  ప్రత్యర్థులు ఎంతో వణికి పోతూ ఉంటారు. అంత అద్భుతంగా రాణిస్తూ ఉంటుంది ఇంగ్లాండ్ జట్టు. ఇలాంటి ఛాంపియన్ జట్టుకు ఇటీవలి కాలంలో గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళగా.. ఇక అక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో లేని పరాజయాన్ని చవిచూసింది.


 ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడింది ఇంగ్లాండ్. అయితే ఇందులో ఒకే ఒక్క టెస్టులో విజయం సాధించలేకపోయింది. అంతేకాకుండా  మరో రెండు టెస్ట్ మ్యాచ్లు మిగిలి వుండగానే వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంది. అయితే సిరీస్ చేజార్చుకోవడం ఒక ఎత్తయితే ఆస్ట్రేలియా జట్టుకు కనీస పోటీ ఇవ్వకపోవడం మరో ఎత్తు. జట్టులో ఒక్క ఆటగాడు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ జట్టు ఘోరపరాభవం తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో కోచింగ్ సిబ్బంది దగ్గర్నుంచి కెప్టెన్ వరకు అందరిని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మార్పు చేస్తుంది అని అందరూ అనుకున్నారు.


 ఇప్పుడు ఇదే జరిగినట్లు తెలుస్తోంది. యాషెస్ సిరీస్ ఘోరపరాభవం నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ పై వేటు వేసింది క్రికెట్ బోర్డు. ఈ విషయాన్ని ఇటీవల అధికారికంగా ధ్రువీకరించింది.. అయితే సిల్వర్ వుడ్ ను హెడ్ కోచ్ గా నియమించడం లో కీలకంగా వ్యవహరించిన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్ గిల్స్ పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఇక సిల్వర్ వుడ్ ను కూడా తప్పించడం గమనార్హం. ఇక కెప్టెన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: