పాపం.. 11 మంది ఆటగాళ్లు లేక.. ప్రపంచకప్ నుంచి తప్పుకుంది?

frame పాపం.. 11 మంది ఆటగాళ్లు లేక.. ప్రపంచకప్ నుంచి తప్పుకుంది?

praveen
ప్రస్తుతం అండర్-19 ప్రపంచ కప్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ ప్రపంచ కప్ లో సత్తాచాటి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసేందుకు ప్రతీ ఆటగాడు కూడా సిద్ధమై పోయాడు. ఈ క్రమంలోనే వచ్చిన ప్రతి అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ మాత్రం అండర్-19 ప్రపంచ కప్ పై కన్నెర్ర చేసింది. వరుసగా ఎన్నో జట్ల లోని ఆటగాళ్ల పై పంజా విసురుతుంది. దీంతో ఇక కరోనా వైరస్ బారిన పడిన ఆటగాళ్లను పక్కన పెట్టి మిగతా మ్యాచ్లు ఆడుతున్నాయ్ అన్నీ జట్లు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఊహించని దుస్థితి ఏర్పడింది.


 వరుసగా ఎంతోమంది ఆటగాళ్లపై కరోనావైరస్ పంజా విసరడంతో కనీసం మైదానంలో పోటీ పడటానికి జట్టుకు సరిపడా 11 మంది సభ్యులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది ఆ జట్టుకు. ఇలా ఆడేందుకు 11 మంది ఆటగాళ్లు లేక చివరికి టోర్నీ మధ్యలోనే తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అండర్ 19  ప్రపంచకప్లో కెనడా జట్టుకు ఈ దుస్థితి ఏర్పడింది. ఇటీవలే జరగాల్సిన మ్యాచ్ లో 11 మంది ఆటగాళ్లు లేకపోవడంతో చివరికి టోర్నీ నుంచి తప్పుకుంది. ఆటగాళ్ల భద్రత దృశ్య ఇక టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి ఏ జట్టుకు రాలేదు అని చెప్పాలి.



 ఇకపోతే  అండర్-19 ప్రపంచకప్ లో సత్తా చాటుతూ దూసుకుపోతున్న భారత జట్టుపై కూడా కరోనా వైరస్ పగ పట్టినట్లుగా వ్యవహరిస్తుంది అన్న విషయం తెలిసిందే. టోర్నీ లీగ్ దశలో ఉన్న సమయంలోనే కెప్టెన్ యష్ దుల్, వైస్ కెప్టెన్  షేక్ రషీద్ సహా మరో నలుగురు ఆటగాళ్లు కూడా వైరస్ బారిన పడ్డారు. దీంతో వీరు లేకుండానే బరిలోకి దిగింది భారత జట్టు. అదృష్టవశాత్తు జంబో జట్టుతో భారత్ బరిలోకి దిగడం ఎంతగానో కలిసి వచ్చింది అని చెప్పాలి.. ప్రధాన ఆటగాళ్లు  వైరస్ బారినపడి ఐసోలేషన్ లో  ఉన్నప్పటికీ మిగతా ఆటగాళ్లు మాత్రం  జట్టును ముందుకు తీసుకెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: