కోహ్లీ, గంగూలీ ఫోన్లో మాట్లాడుకుంటే బెటర్?

praveen
టీమ్ ఇండియా కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకోవడం వివాదం గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన సమయంలో స్వయంగా బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు.  టి-20 కెప్టెన్సీ నుంచి తప్పుకో వద్దు అని కోహ్లీ కి విజ్ఞప్తి చేశామని అయినప్పటికీ తమ అభ్యర్థనను కోహ్లీ మాత్రం పట్టించుకోకుండా టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు అంటూ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇక పరిమిత ఓవర్ల ఫార్మట్ కి ఓకే కెప్టెన్  ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించాల్సి వచ్చింది అంటూ వివరణ ఇచ్చాడు.

 ఇక ఇదంతా అందరు నిజమే అని అనుకుంటున్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టిన విరాట్ కోహ్లీ తనకు ఎవరూ టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోద్దంటు తెలపలేదని.. అంతేకాకుండా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం గురించి కూడా ముందుగా సమాచారం ఇవ్వలేదు అని చెప్పడంతో ఇక అందరూ అవాక్కయ్యారు. దీంతో కెప్టెన్సీ మార్పు కాస్తా వివాదంగా మారి పోయింది. కోహ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కోహ్లీ సౌరవ్ గంగూలీ మధ్య అంతర్గత యుద్ధం నడుస్తోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఏకంగా కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపించేందుకు సౌరవ్ గంగూలీ సిద్ధమయ్యాడు అంటూ కూడా వార్తలు రాగా అదంతా వట్టి ట్రాన్స్ అంటూ గంగూలీ కొట్టిపారేశారు.

 ఇకపోతే తాజాగా ఇదే విషయంపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ మాజీ కెప్టెన్ కపిల్దేవ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. కోహ్లీ సౌరవ్ గంగూలీ  మధ్య విభేదాలు ఉన్నాయి వస్తున్న వార్తల నేపథ్యంలో.. వారిద్దరూ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు కుంటే బెటర్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇక ఈ సమస్యకు తొందరగా స్వస్తి పలకడం ఉత్తమం అని పేర్కొన్నాడు కపిల్దేవ్. ఇకపోతే గతంలో బిసిసిఐ వన్డే కెప్టెన్సీ నుంచి తపించగా.. విరాట్ కోహ్లీ ఇక ఇటీవల తాను టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పు కుంటున్నాను అంటూ విరాట్ కోహ్లీ ప్రకటించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: