10 వికెట్ల వీరుడికి.. ఐసీసీ అరుదైన గౌరవం?

praveen
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రతినెల అటు క్రికెట్ లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్ళకు అవార్డులు ప్రకటించడం చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే డిసెంబర్ నెల కు సంబంధించిన ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ ప్రకటించాల్సి ఉండగా ఈ అవార్డు ఎవరికి దక్కుతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇటీవలే టెస్ట్ సిరీస్లో భాగంగా ఏకంగా 10 కి 10 వికెట్లు తీసి సత్తాచాటి క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించిన ఆజాద్ పటేల్ ఇక ఇప్పుడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా అవతరించాడు. అయితే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో అటు భారత యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్, ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్ లాంటి ఆటగాళ్లు రేసులో ఉన్నారు.

 అయినప్పటికీ న్యూజిలాండ్ ఆటగాడు అజాజ్ పటేల్ కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కడం గమనార్హం. అయితే గత నెలలో న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య వాంఖడే  మైదానంలో జరిగిన మ్యాచ్లో అజాజ్ పటేల్ ఎంత అద్భుతంగా రాణించాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసుకుని అరుదైన రికార్డును సృష్టించాడు అజాజ్ పటేల్. అతని ప్రతిభకు క్రికెట్ ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది అని చెప్పాలి. ఒక ఇన్నింగ్స్ లో ఏకంగా పదికి 10 వికెట్లు తీసిన మూడవ బౌలర్గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు మాజీ ఆటగాళ్లు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే లు మాత్రమే ఇక ఇలా ఒకే ఇన్నింగ్స్ లో 10 కి 10 వికెట్లు తీసిన బౌలర్ లుగా కొనసాగుతున్నారు.

 అయితే మొదటి ఇన్నింగ్స్ లో పది వికెట్లు తీసిన అజాజ్ పటేల్ ఇక రెండవ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో కీలకం గా మారిపోయాడు. ఏకంగా నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో ఇక ఆజాద్ పటేల్ అద్భుతంగా రాణించడంతో  టీమిండియా ఆటగాళ్లు కూడా ప్రశంసల వర్షం కురిపించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఇలా భారత్ లో జరిగిన టెస్టు ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించినందుకే ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు  ప్రస్తుతం దక్కినట్లు తెలుస్తోంది. ఇక అజాజ్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కడం పై స్పందిస్తున్న   ఎంతోమంది మాజీ ఆటగాళ్లు ప్రతిభకు తగ్గ గౌరవం అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: