మూడో టెస్టుకు ముందు.. కోహ్లీ సేనకు మరో ఎదురు దెబ్బ?

praveen
ప్రస్తుతం టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక్కసారి కూడా టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా లో టెస్ట్ సిరీస్ గెలిచిన దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే ఈ సారి కోహ్లీ సేనా పటిష్టంగా ఉండటంతో సౌత్ ఆఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలనే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే మొదటి టెస్టులో టీమిండియా అద్భుతంగా రాణించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 113 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది.


 ఈ క్రమంలోనే టీమ్ ఇండియా రెండో టెస్ట్ మ్యాచ్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తూ విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కావడం టీం ఇండియా కి ఎదురు దెబ్బ తగిలింది.  కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్లో ఓటమి చవిచూసింది. ఇక ప్రస్తుతం సిరీస్ 1-1 తో సమంగా కొనసాగుతోంది. మూడవ టెస్ట్ మ్యాచ్ విజేత ఎవరు తెల్చే మ్యాచ్ గా మారిపోయింది. జనవరి 11వ తేదీన కేప్టౌన్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ కు ముందు టీమిండియాకు మరో ఎదురు దెబ్బ తగిలింది అవుతున్నట్లు తెలుస్తోంది

 గాయం బారిన పడిన టీమిండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ కేప్ టౌన్ వేదిక జనవరి 11వ తేదీన జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్ దూరమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కీలకమైన చివరి మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకోబోతున్నారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మూడవ టెస్ట్ మ్యాచ్ తప్పనిసరిగా గెలవవలసి ఉన్న నేపథ్యంలో అటు జట్టు ఎంపిక కూడా ఎంతో కీలకం గా మారబోతుంది. ఇక సిరాజ్ గాయపడిన పడటంతో జట్టులోకి వచ్చేందుకు ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ పోటీపడుతున్నారు. ఇప్పటివరకు టెస్టు ఫార్మాట్లో వందకు పైగా మ్యాచ్లు ఆడిన ఇషాంత్ శర్మ వైపే టీమిండియా మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: