ఇంగ్లాండ్ కి "డ్రా" ఇప్పుడు "గెలుపు"తో సమానం...

VAMSI
ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య గత నెల రోజుల నుండి యాషెస్ టెస్ట్ సిరీస్ జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు జరిగిన ఎన్నో యాషెస్ సిరీస్ లకంటే ఇది చాలా కొత్తగా ఉంది. ఎప్పుడూ ఇరు జట్లు పోటా పోటీగా తలపడుతూ ఉండేవి. కానీ ఈ సారి అన్ని మ్యాచ్ లు ఏకపక్షంగా సాగుతున్నాయి. ఇప్పయిట్ వరకు ముగిసిన మూడు టెస్ట్ లలోనూ ఆస్ట్రేలియానే విజయభేరి మోగించి సిరీస్ ను కైవసం చేసుకుంది. అయిదు టెస్ట్ ల యాషెస్ సిరీస్ లో ఇంకా ఇంగ్లాండ్ గెలుపు రుచు చూసింది లేదు. అయితే ఈ గెలుపు ఇంగ్లాండ్ కు దక్కేలా కనిపించడం లేదు. గెలుపు కాదు కదా కనీసం డ్రా చేసుకున్నా చాలు అని ఇంగ్లాండ్ మాజీలు సెటైర్లు పేలుస్తున్నారు.
అయితే వరల్డ్ లో బెస్ట్ కెప్టెన్ గా ప్రశంసలు అందుకున్న జో రూట్ ఈ సిరీస్ లో పూర్తిగా తేలిపోయాడు. తన బుర్ర పని చేస్తున్నట్లు లేదు. బౌలర్లు మోస్తరుగా రాణిస్తున్నా బ్యాట్స్మన్ లు అంతా ఫెయిల్ అవుతున్నారు. అయితే నాలుగవ టెస్ట్ లో మాత్రం బెన్ స్టోక్స్, బైర్ స్టో లు ఆకట్టుకున్నారు. అయితే నాలుగవ టెస్ట్ లో ఈ రోజు ఆఖరి రోజు కావడం గమనార్హం. ఇంగ్లాండ్ లక్ష్యాన్న్ని సాధించడం దాదాపు అసాధ్యమే అని తెలుస్తోంది. కానీ డ్రా చేసుకోవడానికి అయినా ప్రయత్నిస్తుందా అంటే కుదిరేలా లేదు. ప్రస్తుతం అయిదవ రోజు ఆటలో 35 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉంది. చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి.
ఫస్ట్ ఇన్నింగ్స్ హీరోలు ఇద్దరూ క్రీజులో ఉన్నారు. మరి ఈ పరుగులను కాచుకుని డ్రా గా ముగిస్తారా లేదా ఎప్పటి లాగే ఆస్ట్రేలియా బౌలర్ల జోరు ముందు లొంగిపోతారా అన్నది తెలియాలంటే ఇంకొక రెండు గంటలు వేచి చూడాల్సిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ మారడం ఖాయం అని తెలుస్తోంది. ఎప్పుడూ ఇంత దారుణమైన ఓటమి చుసిన సందర్భాలు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: