అతనికి బ్యాడ్ టైమ్ నడుస్తోంది... ఆఖరి టెస్ట్ లో చోటు కష్టమే?

VAMSI
ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య 3 టెస్ట్ క సీరీస్ కు ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్ట్ లలో ఒకటి ఇండియా గెలవగా మరొకటి సౌత్ ఆఫ్రికా తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సీరీస్ 1-1 తో సమంగా ఉంది. దీనితో ఆఖరి టెస్ట్ లో విజయం ఎవరిని వరిస్తుందో అన్నది తెలియాలంటే ఇంకా రెండు మూడు రోజులు ఆగాల్సి ఉంది. అయితే ఇప్పుడు మూడవ టెస్ట్ కి జట్టు ఏ విధంగా ఉండనుంది అనే విషయం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. గత కొంత కాలంగా టెస్ట్ మ్యాచ్ లలో విఫలం అవుతూ వస్తున్న సీనియర్ బ్యాటింగ్ ద్వయం అజింక్యా రహానే మరియు చతేస్వర్ పుజరాలకు మరి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. 


వీరిద్దరిపై తమకు నమ్మకం ఉందని, అయితే ప్రతి ఒక్కరికీ కొన్ని కష్టమైన సమయాలు వస్తూ ఉంటాయని... అలాంటప్పుడు వాటికి కుదురుకోవడానికి సమయం ఇవ్వాలని జట్టు యాజమాన్యం తెలిపింది. ఇక గాయం కారణంగా కీలక రెండవ టెస్ట్ కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కేప్ టౌన్ టెస్ట్ కు తిరిగి జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. అయితే కోహ్లీ జట్టులోకి రానున్న సందర్భంలో ఎవరిని తప్పించనున్నారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం తెలుగు ఆటగాడు హనుమ విహారి ని మళ్లీ బెంచ్ కే పరిమితం చేయనున్నారు అని గట్టిగా వినిపిస్తోంది.


విహారిలో అపారమైన ప్రతిభ ఉన్నా జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగాలంటే ఇంకా కొంత కాలం వేచి చూడాలి అని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. రెండవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో కీలక సమయంలో బ్యాటింగ్ కు వచ్చి హనుమ విహారి ఒకవైపు వికెట్లు పడుతున్నా సౌత్ ఆఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. విహారి పోరాటంతో కనీసం 240 పరుగుల లక్ష్యాన్ని సఫారీల ముందు  ఉంచగలిగింది. అయినా తన కష్టం జట్టు యాజమాన్యానికి కనబడినట్లు లేదు. మరి ఈ విషయంలో మళ్లీ బీసీసీఐ ఏమైనా ఆలోచిస్తుందా లేదా అనేది తెలియాల్సిఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: