కోహ్లీ.. అతని సలహా తీసుకో : సునీల్ గవాస్కర్
అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో ఎలాంటి లోపాలు మాత్రం కనిపించడం లేదు. కానీ తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకుంటూ చివరికి పెవిలియన్ చేరుకున్నాడు. కోహ్లీ ఆడుతున్న తీరు జట్టుకు మైనస్ గా మారిపోతుంది. అభిమానులను కూడా నిరాశ పరుస్తోంది. తరచూ ఆఫ్ స్టంప్ ఆవల వెళ్తున్న బంతులను ఆడేందుకు వెళ్లి అనవసరమైన షాట్ ఆడి వికెట్ చేజార్చుకున్నాడు విరాట్ కోహ్లీ ఇప్పుడు ఇదే విరాట్ కోహ్లీకి పెద్ద బలహీనత గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ బలహీనత నుంచి అధిగమిస్తే కోహ్లీకి తిరుగు ఉండదు అంటూ ఇప్పటికే ఎంతో మంది మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం. ఇటీవల ఇదే విషయంపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నూతన సంవత్సరం సందర్భంగా విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక సలహా అడిగితే ఎంతో బాగుంటుంది అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. టీమిండియా 2003- 04 ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సమయంలో సచిన్ టెండూల్కర్ ఆఫ్ సైడ్ బంతులను ఎలా ఎదుర్కున్నాడు. ఒక సారి అడిగి తెలుసుకుంటే బాగుంటుంది అని తెలిపాడు. మూడో టెస్ట్ మ్యాచ్లో క్యాచ్ అవుట్ అయిన తర్వాత మళ్లీ అలాంటి షాట్లు ఆడను అంటూ సచిన్ తెలిపాడు. ఇక ఆ తర్వాత అలాంటి బంతులను వదిలేసి ఆడాడు. సచిన్ ఇలా మంచి బంతులను మాత్రమే ఆడుతూ భారీ పరుగులు రాబట్టాడు. కోహ్లీ కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కోహ్లీ బ్యాటింగ్ లో ఎలాంటి లోపాలు లేవు కాని దురదృష్టవశాత్తు ఆఫ్ స్టంప్ బంతులను ఆడి అవుట్ అవుతున్నాడు క్రికెట్ లో ప్రతి ఆటగాడు తప్పులు చేయడం సహజం అయితే క్యాచ్ చెజారిస్తే కొంతమంది బ్రతికి పోతూ ఉంటారు. అలాంటి అదృష్టం కోహ్లీకి లేదు అని తెలిపాడు సన్నీ.