భారత క్రికెట్ లో ఒకే ఒక్కడు.. బుమ్రా అరుదైన రికార్డు?

praveen
భారత క్రికెట్ జట్టులో బూమ్రా ఎంత కీలకమైన బౌలరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నోసార్లు టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో తనదైన బౌలింగ్తో టీమిండియాను విజయతీరాలకు చేర్పించిన ఘనత జస్ప్రిత్ బూమ్రా సొంతం అనే చెప్పాలి. బుల్లెట్ లాంటి పదునైన బంతులు సందిస్తూ ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లకు చమటలు పట్టిస్తూ ఉంటాడు జస్ప్రిత్ బూమ్రా.. ఇక బుమ్రా సందించే యార్కర్లకు  ప్రత్యర్థి బ్యాట్స్మెన్ దగ్గర సమాధానం ఉండదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తూ ఉంటాడు  జస్ప్రిత్ బూమ్రా. ఇక తనదైన బౌలింగ్ తో టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి.



 అంతేకాదు ఇక భారత క్రికెట్లో డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా కూడా జస్ప్రిత్ బూమ్రా కు ఎంతగానో గుర్తింపు ఉంది. ఇకపోతే ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా జస్ప్రిత్ బూమ్రా అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.  టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ ఫార్మాట్లో సంచలన రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున విదేశాలలో అత్యంత వేగంగా 100 టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అయితే భారత క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ కూడా బూమ్రా కావడం గమనార్హం. ప్రస్తుతం టీమిండియా జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉండగా ఇక ఇటీవల సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది.

 113 పరుగులు తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించడం గమనార్హం. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ వాన్ డెర్ డాసన్ ను ఔట్ చేసిన బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. కేవలం 43 ఎన్నికల్లోనే విదేశాల్లో వంద వికెట్లు తీశాడు జస్ప్రిత్ బూమ్రా. ఇప్పటి వరకు 25 టెస్టులు ఆడిన జస్ప్రిత్ బూమ్రా 105 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా టెస్ట్ క్రికెట్ లో తీసిన 105 వికెట్లలో 101 వికెట్లు విదేశాల్లోనే తీయటం గమనార్హం. కాగా 2018లో దక్షిణాఫ్రికాలోనే తన టెస్ట్ కెరీర్ను ప్రారంభించాడు  బుమ్రా. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా భారీ తేడాతో ఘన విజయం సాధించడంతో పాటు భారత అభిమానులు అందరూ హ్యాపీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: