హెరాల్డ్ ఫ్లాష్ బ్యాక్ - 2021 : అందరినీ ఆశ్చర్యపరిచిన క్రికెట్ విశేషాలివే?
వరుసగా మూడు వికెట్లను పడగొట్టి హ్యాట్రిక్ సాధించడం అంత తేలికేం కాదు. హ్యాట్రిక్ వికెట్ల పడగొట్టడం అంటే మాటల్లో చెప్పలేని అనుభూతి నిస్తుంది. మరి అలాంటి అరుదైన రికార్డును 2021లో ఒకే టోర్నమెంట్‌లో ముగ్గురు బౌలర్లు సాధించడం గమనార్హం.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కర్టిస్ కాంఫర్ తొలిసారి అతని కెరీర్లో హ్యాట్రిక్ సాధించాడు. తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గానూ అవార్డు దక్కించుకున్నాడు.
శ్రీలంక ఆల్‌రౌండర్ వహిందు హసరంగ దక్షిణాఫ్రికా జట్టుపై హ్యాట్రిక్ సాధించాడు. అయినప్పటికీ శ్రీలంక జట్టు ఓటమి చవిచూసింది .
ప్రొటీస్ పేస్ బౌలర్ కగిసో రబాడ హాట్రిక్ వికెట్లు తీసి అద్భుతం సృష్టించాడు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లు అద్భుతంగా రాణించడంతో జట్టు విజయం సాధించింది. కానీ సెమీ ఫైనల్ నుంచి దక్షిణాఫ్రికా జట్టు నిష్క్రమించాల్సి వచ్చింది.
2022 టెస్టు ఫార్మాట్‌లో ఒకే ఒక్క బౌలర్ హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఘనత సాధించాడు. వెస్టిండీస్ జట్టుపై ఆఫ్రికా బౌలర్ హ్యాట్రిక్ సాధించాడు. జూన్‌లో దక్షిణాఫ్రికా రెండు టెస్టులు, ఐదు టీ20లు ఆడేందుకు విండీస్ పర్యటనకు వెళ్లగా.. జూన్ 18 న జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో కేశవ్ మహరాజ్ హ్యాట్రిక్ సాధించడం గమనార్హం.
ప్రపంచ క్రికెట్లో యాషెస్ సిరీస్ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ సిరీస్ ఆటగాళ్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇలాంటి ప్రత్యేకమైన టోర్నీలో హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరితే ఆ బాధ మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. యాషెస్ రెండో టెస్టులో ఓటమి అంచులో ఉన్న జట్టును ఆదుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసిన జోస్ బట్లర్ చివరికి హిట్ వికెట్గా వెనుదిరిగాడు.
టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ భారత పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో భారత బౌలర్ హర్షల్ పటేల్ అరంగేట్రం మ్యాచ్లోనే హిట్ వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అతను అవుటైన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
టెస్ట్ క్రికెట్లో సూపర్ ఓవర్ కి దాదాపు చాన్స్ ఉండదు. ఇక వన్డేల్లోనూ సూపర్ ఓవర్ రూల్ తీసుకొచ్చినా.. అప్పుడప్పుడు మాత్రమే అవసరం పడుతుంది. ఈ ఏడాది దాని అవసరం రాలేదు. టీ-20 ఫార్మెట్లో మాత్రం సూపర్ ఎవరు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే 2021 సంవత్సరంలో అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఒకసారి సూపర్ ఓవర్ అవసరం అయింది. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ అమెరికన్ రీజియన్ క్వాలిఫయిర్‌లో భాగంగా కెనడా, యూఎస్‌ఏ జట్ల మధ్య నవంబర్ 10న మ్యాచ్ జరుగగా ఇరు జట్లు 142 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్ అనివార్యంగా మారిపోయింది . ఇక యూఎస్‌ఏ సూపర్‌ఓవర్‌లో 22/1 స్కోరు చేస్తే.. కెనడా 14 పరుగులకే పరిమితమై ఓటమి పాలు కావాల్సి వచ్చింది.