వైరల్ : లడ్డూ లాంటి క్యాచ్.. ఇలా చేశాడేంటి?
ఈ క్రమంలోనే ఇలా క్రికెట్ ఆటగాళ్లు ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏదైనా చిన్న పొరపాటు చేశారు అంటే చాలు అటు సోషల్ మీడియాలో ఎంతోమంది ట్రోల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. సౌత్ ఆఫ్రికా గడ్డపై టీమిండియా ఆడిన తొలి టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లంచ్ బ్రేక్ వరకు వెళ్ళింది. అయితే 36 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ వికెట్ కోల్పోతాడు అని అందరూ అనుకున్నారు కానీ అదృష్టం బాగుండి చివరికి బ్రతికి పోయాడు..
మార్కో జాన్సన్ వేసిన 17 ఓవర్ 4 బంతికి మయాంక్ అగర్వాల్ బ్యాట్ ఏడ్జ్ తాకుతూ బంతి కీపర్ వైపుగా దూసుకెళ్లింది. అయితే కీపర్ డికాక్ డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. కానీ అంతలోనే బంతి చేతిలో నుంచి జారి పోయింది. ఇక పక్కనే ఉన్న ఎల్గర్ క్యాచ్ పట్టుకునేందుకు అవకాశం వచ్చింది. కానీ అతను కూడా వదిలేయడంతో చివరికి మయాంక్ అగర్వాల్ వికెట్ కోల్పోకుండా తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లడ్డూ లాంటి క్యాచ్ వదిలేశాడు ఫలితం అనుభవించండి అంటూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెట్టాడు క్రికెట్ అభిమాని.