భారత్ గెలవడం కష్టమే.. ఆకాష్ చొప్రా షాకింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా మూడు వన్డేలు మూడు టెస్ట్ మ్యాచ్ లు ఆడపోతుంది భారత జట్టు.. ఇక వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్సీ వహిస్తూ ఉండగా టెస్ట్ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సి వహిస్తున్నాడు. అయితే డిసెంబర్ 26వ తేదీన అంటే రేపటి నుంచి భారత్ సౌతాఫ్రికా మధ్యాహ్నం మొదటి టెస్ట్ ప్రారంభం కాబోతోంది.. అయితే బాక్సింగ్ డే టెస్టు లో విజయం సాధించి జోరు కొనసాగించాలని భావిస్తుంది టీమిండియా. అంతేకాదు ఇక సౌత్ ఆఫ్రికా పర్యటనలో శుభారంభం చేయాలని భావిస్తోంది.. ఈ క్రమంలోనే ఎన్నో అద్భుతమైన వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతోంది.



 అయితే ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటన భారత క్రికెట్ లో ఎంతో ప్రత్యేకతను సొంతం చేసుకుంది అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఒక్క సారి కూడా సౌత్ఆఫ్రికా పర్యటనలో భారత జట్టు గెలిచిన దాఖలాలు లేవు. కాని ఇప్పుడు మాత్రం టీమిండియా ఎంతో బలంగా కనిపించడమే కాదు సొంతగడ్డపై విజయంతో ఎంతో ఆత్మవిశ్వాసంతో కూడా ఉంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఈసారి టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటనపై తప్పక విజయం సాధిస్తుంది అని అందరూ భావిస్తున్నారు. విజయం సాధించడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి అనే దానిపై కూడా సూచనలు సలహాలు ఇస్తున్నారు మాజీ ఆటగాళ్ళు.


 ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు క్రికెట్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. టెస్ట్ సిరీస్లో సౌత్ఆఫ్రికాపై భారత్ విజయం సాధించడం చాలా కష్టం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. గాయం కారణంగా సౌత్ఆఫ్రికా జట్టులో స్టార్ ఆటగాడు నోర్జె  దూరం కావడం కారణంగా అటు సిరీస్ 1-1 తో సమానంగా ముగిసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇలా సిరీస్ డ్రాగా ముగిసే అవకాశం ఉందని ఒక వేళ ఏదైనా జట్టు గెలవాల్సి  వస్తే అది సౌత్ ఆఫ్రికానే జోస్యం చెప్పాడు ఆకాశ్ చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: