రోహిత్ శర్మ వికెట్ కోసం పక్కా ప్లాన్ ?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ లో స్టార్ ప్లేయర్ గా  కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. ముఖ్యంగా టీ-20 ఫార్మెట్లో అయితే రోహిత్ శర్మకు ఎవరు సాటిరారు అని చెప్పాలి.. ఓపెనర్లుగా బరిలోకి దిగుతు భారీగా పరుగులు చేస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. ఒక్కసారి మైదానంలోకి దిగాడు అంటే చాలు సిక్సర్, ఫోర్లతో అదరగొడుతు ఉంటాడు. ఇక భారత క్రికెట్లో డబుల్ సెంచరీలు దీరుడిగా రోహిత్ శర్మ అరుదైన రికార్డును సృష్టించాడు. అంతేకాదు ఇక రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలి కూడా ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తూ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా ఇటీవలే  వరల్డ్ కప్ తర్వాత టి20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ప్రస్తుతం టీమిండియా పూర్తి స్థాయిలో  కెప్టెన్ గా మారిపోయాడు రోహిత్ శర్మ.

 ఇక ఇటీవలే రోహిత్ శర్మ t20 కెప్టెన్గా స్వదేశంలో ఆడిన మొదటి టి20 సిరీస్ లోనే విజయం సాధించి శుభారంభం చేశాడు అనే చెప్పాలి. అయితే ఇటీవలే చిన్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. ఓపెనర్గా అదరగొట్టాడు అని చెప్పాలి. కానీ వరుసగా రెండు మ్యాచ్లలో మాత్రం రోహిత్ శర్మ నిరాశపరిచాడు. ముఖ్యంగా టి20 వరల్డ్ కప్ లో భాగంగా  టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ దాయాది దేశమైన పాకిస్థాన్ తో జరిగింది. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తారు అని అందరూ అనుకున్నారు.

 కానీ అనుకోని విధంగా రోహిత్ శర్మ వికెట్ కోల్పోయాడు. ఇది టీమిండియాకు ఎంతో మైనస్ అయింది అని చెప్పాలి. టీ 20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ వికెట్లు తీయడం పై ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక రోహిత్ శర్మ వికెట్ కోసం స్వయంగా రమీజ్ రాజ రంగంలోకి దిగాడట. రోహిత్ వికెట్ పడగొట్టడం కోసం తాను కెప్టెన్ బాబర్ అజామ్ కి  పలు సూచనలు చేశా అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రమీజ్ రాజా. షాహిన్ అఫ్రిదీ వంద మైళ్ల వేగంతో ఇన్ స్వింగర్ వేయాలని రోహిత్ శర్మకు సింగిల్ కి కూడా ఛాన్స్ ఇవ్వద్దు అని.. అలా అయితే అలా అయితే అతని వికెట్ తీసే అవకాశం ఉందని సూచనలు చేశా అంటూ ఇంటర్వ్యూ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: